గూగుల్ లో e-తెలుగు

గూగుల్ లో "తెలుగు" అని ఆంగ్లాక్షరాలతో ఎప్పుడయినా టైపు చేసి చూసారా? మొదటగా ఆంగ్ల వికిపీడియాలో తెలుగును గూర్చిన వ్యాసం వస్తుంది. తర్వాత తర్వాత ఎక్కువశాతం సినిమా కబుర్ల సైటులూ లాంటి చెత్తా చెదారం కనిపిస్తాయి. నేను సెర్చి చేసిన సమయానికి తెలుగు సైటు 5 వ లేక 6 వ పేజీలో కనిపించింది. దీనిని మనం మార్చలేమా?

చాలా మంది వారికి తెలిసిన వెబ్ సైట్లను కూడా ముందుగా గూగుల్ లో టైపు చేసి అక్కడి ఫలితాలమీద నొక్కి సందర్శిస్తారు(నాకు పరిచయం ఉన్నవాళ్ళలో చాలా మంది). ఎవరైనా ఎప్పుడైనా తెలుగు అని వెదికినప్పుడు, e-తెలుగు సైటు కనిపిస్తే(మొదటిపేజీలో) చాలా బాగుంటుంది కదా? ఇప్పుడు మంటనక్క నూతన వెర్షను విహరిణిలో గూగుల్ సెర్చి ఫలితాలను వినియోగదారులు Edit చేసే అవకాశం ఉంది. అంచేత, ఈ సందేశం చదివిన అందరికీ నా విన్నపం: మీరందరూ ఒక్కసారి గూగుల్ ని తెరచి, అందులో తెలుగు అని సెర్చి కొట్టండి. ఫలితాలు వచ్చాక మీరో కొత్త ఫలితాన్ని(అనగా e-తెలుగు సైటు లంకెను) సెర్చి ఫలితాలకు జత చేర్చండి.ఈ విధం గా ఎక్కువమంది చేయడం వల్ల ఫలితాల్లో e-తెలుగు సైటు మొదటి స్థానంలోకి వస్తుంది. దీని వలన మరింత ప్రాచుర్యం కలుగుతుందని నా నమ్మకం

స్నేహపూర్వక అభినందనలతో
యోగి

మంచి పాయింటు లేవనెత్తారు. నా

మంచి పాయింటు లేవనెత్తారు. నా సూచనలు కొన్ని:
1. ముందు మనం మన సైటును SEO చెయ్యాలి. ఎక్కడా telugu అనే మాటే సైటులో లేకపోతే "telugu" కోసం చేసే అన్వేషణలో గూగులుకిదసలు కనబడదు గదా. అంచేత పేజీ టైటిల్లోను, ఇంకా వీలైన ఇతర చోట్ల "telugu" ను చేర్చాలి.
2. అలాగే ఇక్కడ ఇంగ్లీషులో ఒక పేజీ పెట్టాలి. మన సైటు, సంఘ కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరించాలీ పేజీలో. ఈ రెండూ చేస్తే మన ఉనికి పెరుగుతుంది.
3. etelugu.org కి మన బ్లాగుల నుండి లింకులు ఇవ్వాలి. ఓ బొత్తాన్ని (ఆల్ట్ టెక్స్టు తప్పక ఉండేలా చూసుకుని) పెట్టుకోవాలి. ఏ సైటుకైతే జాలం నుండి ఎక్కువ లింకులు పోతాయో, ఆ సైటుకు గూగులు ఎక్కువ గౌరవం ఇస్తుందని మనకు తెలిసిందే గదా!

"తెలుగు" కోసం గూగిలిస్తే మన సైటు పదో స్థానంలో వచ్చింది. దాన్ని కూడా పైకి నెట్టాలి.

మామ్మూలుగా search engines,

మామ్మూలుగా search engines, పేజ్ htmlలోని key words ఆధారంగా search results ఇస్తాయి. కాని ఇక్కడ మనం source చూడలేకున్నాము.
ఇది ఈ తరహా వెబ్ దిజైన్ ప్రత్యేకతా? మనం సైటుకి మూస డిజైను కాక మన అవసరాలకు తగిని దిజైను చేసుకూంటే చాలా రుగ్మతలు తొలగుతాయని నా అభిప్రాయం
దూర్వాసుల పద్మనాభం

చదువరి గారూ, మీ సూచనలు సరి

చదువరి గారూ, మీ సూచనలు సరి అయినవి. మన బ్లాగులనుంచి లంకెనివ్వడానికి ఏదయినా Button లాంటిది అందుబాటులోకి తేగలరా?

రెండు బటన్లున్నాయండి, రెంటిలో

రెండు బటన్లున్నాయండి, రెంటిలో దేన్నైనా వాడుకోవచ్చు. రెంటినీ వాడుకోవచ్చు కూడాను.

ప్రొమోషను బొమ్మ -1

దీని కోడు: ఈ కోడును కాపీ చేసి మీ బ్లాగులో/వెబ్‌సైటులో పెట్టుకోండి

<a href="http://etelugu.org/" target="_BLANK" title="e-తెలుగు: కంప్యూటర్లో తెలుగు కోసం">
<img border="0" alt="e-తెలుగు" src="http://etelugu.org/promote/etelugu-100x27.png"/>
</a>

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ప్రొమోషను బొమ్మ -2

దీని కోడు: ఈ కోడును కాపీ చేసి మీ బ్లాగులో/వెబ్‌సైటులో పెట్టుకోండి

<a href="http://etelugu.org/helpcenter"> <img alt="eతెలుగు" style="border: 0pt none; width: 100px; height: 32px;" src="http://mpradeep.blogspot.googlepages.com/eTelugu.gif" target="_blank" title="eతెలుగు"/></a>

naaku apple layoutlo telugu

naaku apple layoutlo telugu type cheyadam vachhu. kaani e telugulo telugu type ravatamledu. apple layout ekkada ela panichestadi.. ? cheppagalaru

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer