అందరికీ నమస్కారం!
అందరికీ నా నమస్కారాలు!
నా పేరు ఆదిత్య. నేను కరీంనగర్ నివాసిని. ప్రస్తుతం ఇక్కడే ఒక కాలేజిలో బీ.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇవాళ్ళే వార్తాపత్రికలో ఈ సైట్ గురించి చదివాను, వెంటనే వచ్చి చేరాను!
నాకు అనేక భాషలు నేర్చుకోవడం ఒక సరదా. ప్రస్తుతం జపనీసు భాష నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడానికి ముందు నెట్ మీద కొందరిని ఆ భాష ఎలా వుంటుందో అడిగాను. "అసలు ముందు పదాలు స్పష్ఠంగా పలకడం చాలా కష్టం" అన్నారు. కాని నేను మొదలుపెట్టాక చూస్తే ఉచ్ఛరణ చాలా తేలికగా ఉంది. ఎందుకో తెలుసా?
నా ప్రశ్నకు "కష్టం" అని సమాధానం ఇచ్చిన వళ్ళాంతా అమెరికన్లు. ఆంగ్లం లో జపనీసు కోసం కావాల్సిన కొన్ని శబ్దాలు లేవు. అందుకే అది వారికి కష్టంగా ఉంటుంది. అసలు విషయమేమిటంటే, జపనీసులో ఉన్న శబ్దాలన్నీ కలిపితే అవి తెలుగులో ఉన్న సగం శబ్దాలకన్నా తక్కువ!
ఆ, ఈ, ఊ, ఏ, ఓ
అంతే! ఈ ఐదచ్చులతో జపనీసులో ఉన్న అన్ని శబ్దాలన్నీ బైటికి తియ్యచ్చు!
ఇది గమనించిని రోజు నుండి నాకు తెలుగు మీద ఉన్న ప్రేమ మరింత పెరిగింది. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను!
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

ఆదిత్య గారూ, ముందుగా ఈ విషయం
ఆదిత్య గారూ,
ముందుగా ఈ విషయం తెలియజెప్పినందుకు నెనరులు. జపాను విశేషాలను ప్రఫుల్ల చంద్ర తన బ్లాగు అదన్నమాట సంగతిలో రాసారు. అక్కడ కొన్ని జాపనీసు పదాల గురించి కూడా రాసారు. మీకు ఆసక్తిగల విషయం కాబట్టి ఒకసారి చూడండి. ఈ సైటులో తెలుగు బ్లాగరుల వివరాలు, నివాస స్థలాల వారీగా ఉన్నాయి. కరీంనగరు జాబితాలో మీ పేరు చేర్చండి.
జపనీసు గురించి ఉన్న బ్లాగు
జపనీసు గురించి ఉన్న బ్లాగు వివరాలు ఇచ్చి నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన కరీంనగర్ బ్లాగు వివరాలు నాకు సైటు లో దొరకలేదు. దయచేసి మీరు సైటు బ్లాగ్ల లింక్ ఇవ్వగలరా? ధన్యవాదాలు!
కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం అనే
కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం అనే సైటు చూడండి.
మీకు బ్లాగుంటే, మీ పేరునీ మీ బ్లాగు చిరునామాని ఇక్కడ చేర్చండి.