తెలుగు నిలుపుట

తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చేసింది. సంతోషం. అయితే మాధ్యమాల్లోను, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజావసరాలు, దుకాణాలు మొదలైన వాటిల్లోను తెలుగు వాడకం ఎలా ఉంటోందని గమనిస్తే భాషాభిమానులకు ఆవేదన కలుగుతుంది. టీవీ ఛానెళ్ళలో వాడే తెలుగులో తెలుగు కాక, ఇంగ్లీషే ఎక్కువగా ఉంటోంది. సినిమాల్లో పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. పరిపాలన ఎక్కువగా ఇంగ్లీషులోనే జరుగుతోంది. బడుల్లో తెలుగు మాధ్యమం స్థానే ఇంగ్లీషును ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నేటి భాష, రేపటి భాషా కాక, కేవలం ప్రాచీన భాషే అయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. తెలుగును కలకాలం నిలుపుకునేందుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజలూ నడుం కట్టాల్సిన అవసరం ఏర్పడింది.

e-తెలుగు సంఘం ఈ విషయమై తన గళాన్ని వినిపించాలని నా ఉద్దేశ్యం. రాబోయే e-తెలుగు సమావేశంలో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. ఈ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయమై సభ్యులు తమతమ అభిప్రాయాలు ఇక్కడ తెలుపుతూ దిశానిర్దేశం చెయ్యాలని కోరుతున్నాను.

e-తెలుగు కంప్యూటర్లు మరియు

e-తెలుగు కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుకై మాత్రమే పాటుపడుతుందని అనుకున్నాం. అసలు తెలుగు వాడకమే కనుమరుగైపోతే, ఇక కంప్యూటర్లలోనూ దాని అవసరం ఉండదు. అప్పుడు మనం ప్రత్యేకంగా చేసేదీ ఏమీ ఉండదు.

అయితే ఈ విషయంలో మనమే ఏమైనా చెయ్యాలా లేక తెలుగు భాషా ప్రచార సమితి లాంటి సమూహాలతో కలిసి పనిచేయాలా అని ఆలోచించాలి.

modhata manamu maraali

modhata manamu maraali taruvaatha eduti vaari gurinchi matladaali
mana raastram lo ekkadaina telugu lo sign boards unnaya,

avaraina guda chakkani telugu lo matladagalara, eppudu nenu kuda telugu ni english lo type chaesanugada,telugu channels lo vache anchors

telugu lo matldutunnara, interview lo, kanianchoring lo kuda poorthiga telugu ni upayogistunnara?

శశిధర్ గారూ, మీరు చెప్పిన

శశిధర్ గారూ,
మీరు చెప్పిన మార్పుల విషయంలో మనమేం చెయ్యగలమో సూచించగలరు. ఈ చర్చ ఉద్దేశ్యం కూడా అదే!

regular ga samaveshalu erpatu

regular ga samaveshalu erpatu cheyali. charchalu vistrutanga saagali..

చదువరి గారూ, ఇంద చక్కని

చదువరి గారూ,

ఇంద చక్కని చర్చను మొదలు పెట్టనందుకూ నెనర్లు.

మనకు చాలా ఉత్సాహం ఉంది, కోరిక ఉంది, కానీ అదే సమయంలో మన లిమిటేషన్లు కూడా తెలుసుకోవాలి.
1. మనకు ఉన్న అంగ బలం చాలా తక్కువ
2. అధికార బలం లేదు
3. అర్ధ బలం కూడా చాలా తక్కువ.
4. సమయం కూడా తక్కువ

కనుక మనం చిన్న చిన్న పనులు, ప్రభావశాలమైనవీ తీసుకొని భవిష్యత్తు తరాలకు తెలుగును సగర్వంగా అందించే యత్నం చేస్తే ఎలా ఉంటుంది

ఉదాహరణకు
1. తెలుగు ఝండా ఉరూరా ఎగరవేసే కార్యక్రమాలు
2. ఈ తెలుగు తరపున బళ్లలే అధ్బుతమైన లైబ్రరీలు మెయింటైన్ చెయ్యటం.
3. తెలుక్కి సంబందించి ఐటీ ప్రాజెక్టులు స్పాన్సర్ చెయ్యటం.

కిరణ్, మీ ఉద్దేశ్యం

కిరణ్, మీ ఉద్దేశ్యం అర్థమయింది. మనకు చేతనైనంతలోనే చేద్దాం. అధికార బలాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఏం చేద్దామనేది స్పష్టంగా తేల్చుకుంటే ఆర్థిక సంపత్తి సమకూర్చేందుకు తెలుగు నెజ్జనులు ముందుకు వస్తారని నా ఉద్దేశ్యం. నిజానికి ఆర్థిక బలం కన్నా నెజ్జనుల సంఘీభావం ముఖ్యం. అదే మన అంగబలం. ఇక మీరన్న "సమయముం"దే.. అది లేకపోవడమే మనకు అన్నిటికంటే పెద్ద సమస్య.

ఇక మీ సూచనలు - బాగున్నాయి. వీటి ఆచరణీయతను, మనం చర్చించాలి.

e-తెలుగు సంఘం అన్న ( వివిధ

e-తెలుగు సంఘం అన్న ( వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజావసరాలు, దుకాణాలు ) మాద్యమాలలో గళం వినిపించేబదులు ఒక వేదిక ( అంతర్జాలం, IT) లోనో ఘట్టిగా తన ఘర్జిస్తే ఆ ఘర్జన అందరికీ విని పిస్తుందని నా నమ్మకం. మనం తెలుగు కు తోర్పడు వివిద గుంపులు ( బ్లాగులు,వికి,తెలుగు లైనెక్సు ,..) అందరి ని ఒక చోట సమావేశ పరిచి ఘర్జిదాం ..ఆ ఘుర్జన కు మీడియా, ప్రైవేటు,ప్రభుత్వ ముఖులను అహ్వానిద్దాం, వేదిక కోరకు మన తెలుగు విశ్వవిద్యాలయాన్ని కోరదాం )

ఎన్నికలు రాబోతున్నాయి. పోటీ

ఎన్నికలు రాబోతున్నాయి. పోటీ చేసే ప్రతీ అభ్యర్థికీ తెలుగు ఎలా వెనకబడిపోతోందో చెబుతూ ఉత్తరాలు రాయాలి. ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలుగును నిలిపేందుకు తగు చర్యలు తీసుకుంటామని వాళ్ళచేత చెప్పించాలి. తమ ప్రసంగాల్లో తెలుగును నిలబెట్టడం పట్ల తమ నిబద్ధతను తెలుపమని కోరుదాం. వాళ్ళేమైనా చెయ్యగలరా లేదా అనేది పక్కన పడదాం.. ఫలానా విషయం కూడా ఒక ఎన్నికల అంశమే అనే సంగతిని వాళ్ళ మెదళ్ళలోకి ఎక్కించేవరకైనా మనం సాధించవచ్చనుకుంటాను.

రాబోయే ఎన్నికలకు సన్నాహకాలే ఇప్పుడు జరుగుతున్న గర్జనలు, పర్యటనలు, ప్రచారాలూను. జనాల్లో తిరుగుతున్న ఈ రాజకీయుల దృష్టిని కూడా కాస్త ఈ అంశం మీద పడేలా చెయ్యాలి. ఒకళ్ళిద్దరు ఈ అంశం గురించి మాట్టాడుతుంటే మిగతావాళ్ళు కూడా అనుసరిస్తారు

చాలా సంతోషంగా ఉంది.చదువరిగారు

చాలా సంతోషంగా ఉంది.చదువరిగారు అసలు విషాయాన్ని బయట పెట్టారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, తెలుగు భాష జన్మస్థలంలోనే అంతరించిపోతుంది. ఇది సత్యం.మనం అర్భకులం. అంచేత ఏమి చెయ్యగలం అని అనుకోవటం సరి కాదు. మనలో కార్యదక్షత, నిజాయితి ఉంటే తప్పక అనుకున్నది సాధించ వచ్చు. ఇది ఒకటి రెండు రోజులలో జరగక పోవచ్చు. కాని నిద్రపోతున్న తెలుగు భాషా సమితి వంటి సంస్థలను, ప్రభువులను మేలుకొలిపి, తెలుగుకి విద్యాసంస్థలలోను ఇతరత్రా ప్రాధాన్యత వచ్చేటట్టు చెయ్యవచ్చు. రాజాకీయాల జోలుకి పోకుండా, రాజకీయనాయకులపై మనకు చేతనైన రీతిలో ఒత్తిడి పెంచాలి. అందుకే నేను పదే, పదే చెప్తున్నాను. మన ఈ-సంఘాన్ని సరియైన రీతిలో ఆర్గనైజ్ చెయ్యాలి.

ఈ సారి మన సమావేశానికి వీలైనంత మంది వచ్చేటట్టు చూడాలి. ఈ విషయంలో నాకు ఇమెయిలు చిరునామాలు, టెలిఫోను నంబర్లు ఇవ్వగలిస్తే ఈ పని నీను చేస్తాను.

-దూర్వాసుల పద్మనాభం

నా దృష్టిలో చాలామంది తెలుగులో

నా దృష్టిలో చాలామంది తెలుగులో వ్రాసే నెజ్జనులు కూడా తెలుగింతే..తెలుగు వాళ్లింతే అని తెలుగును భూమి క్రింద పదడుగులలోతున సజీవంగా పూడ్చిపెట్టేశారు. ముందు త్రవ్వితీస్తే కదా..ఘర్జించేది ఘాండ్రించేది. తెలుగెందుకో ముందు అందరూ (కనీసం క్రియాశీలకంగా పనిచేయాలనుకున్నవాళ్ళు) తెలుసుకోవాలి. మనం తెలుగుతో ఏం సాధించాలనుకున్నామో తెలిస్తే అది స్పష్టంగా తెలియజేయవచ్చు. ఈ తెలుగోళ్లకి తెలుగును ఒక సాంస్కృతిక ప్రతీకగా, ఒక ఫ్యాషన్గా, ఒక గర్వకారణమైన విషయంగా మార్కెట్ చేసేదెట్టా తిరుమలేశా???? ఇంతకీ అసలు ప్రశ్న తెలుగెందుకు? దీనికి ఖరాఖండిగా జవాబు చెప్పలేనంత వరకూ మనం (అంతర్జాలంలోని తెలుగు నెజ్జనులు) మెడ తెగిన కోళ్ళమే!!

నా అభిప్రాయం ప్రకారం,మనకు

నా అభిప్రాయం ప్రకారం,మనకు అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపెట్టక అసలుసిసలు అధికారికమైన సమాధానం/వివరణ మనకు కావాలి తెలుగుభాషా వినియోగంపై.సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని ఉద్దేశించి ఒక దరఖాస్తునుఇ-తెలుగు తరపున దాఖలు చెయ్యాలి.తద్వారా వారు మనం తదుపరి చేపట్టే చర్యలకు అంగీకరించటమో/తిరస్కరించటమో అధికారికంగానే తెలుస్తుంది.
ఈలోపు ఆన్ లైన్ పిటీషన్ ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారి,తెలుగుభాషాభిమానుల నుంచి సంతకాలు సేకరించటం జరుగుతూ ఉండాలి అన్నవి ఇప్పటికిప్పుడు నేను సూచించగలిగినవి.

ఎంతసేపూ తెలుగుభాషగురించి

ఎంతసేపూ తెలుగుభాషగురించి బాధపడేవాళ్ళే తప్పిస్తే క్రియాశీలకమైన ఆలోచనలు చేసీవాళ్ళు తక్కువగా కనిపించిన నాకు ఇక్కడ వ్యాఖ్యలు చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది.
ప్రభావం చూపేలా తెలుగుభాషా ప్రచారం చెయ్యాలంటే, మన పరిధిలో రకరకాలుగా ప్రయత్నం చెయ్యాలని నాకనిపిస్తోంది.
ఒకవైపు, రాజేంద్రగారు చెప్పినట్టు తెలుగుభాష వినియోగంపై అధికారిక సమాచారాన్ని సంపాదించడం.
మరోవైపు ప్రభుత్వం, రాజకీయనాయకులపై వత్తిడి తేవడం. ఇది ఎంతవరకూ సాధ్యమవుతుందన్న దానిపై నాకు నమ్మకం కొంచెం తక్కువగా ఉంది.
నా ఉద్దేశంలో మరో ముఖ్యమైన కోణం ప్రజలలో కొంత కదలిక తీసుకురావడం. ఇదికూడా అంత సులువైన విషయం కాదు కాని గట్టిగా ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమవుతుందని అనిపిస్తోంది. ఒక ఏడాది, రెండేళ్ళు ఉద్యమంలా శ్రమిస్తే, ఆశించిన ఫలితాలు వస్తాయనుకుంటున్నాను. దీనికి ఉన్న మందొకటే, ప్రచారం ప్రచారం ప్రచారం. ఒక ప్రణాళిక ప్రకారం వీలైనన్ని ప్రచారమాధ్యమాల ద్వారా తెలుగు భాష మాట్లాడడం గురించిన అపోహలని తొలగిస్తూ, తెలుగు భాషమీద అభిమానం పెంచేలా ఊదరగొట్టడమే. ముఖ్యంగా టార్గెట్ చెయ్యాల్సిన వర్గం నగరాల్లో చదువుకున్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనవంతుల వర్గాలు.
ఈ ప్రచారానికి భారతదేశంలో (ముఖ్యంగా ఆంధ్రాలో) ఉన్నవాళ్ళు ఒక ఇరవై ముప్ఫైమంది దాకా కలిస్తే మంచిది. ఈ పని చెయ్యడానికి వైజాసత్యగారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా ముఖ్యం. తెలుగెందుకో తెలుసుకోవాలి. అయితే దీనికి నిజంగా వెతికితే ఓ కచ్చితమైన సమాధానం ఉంటుందని నేననుకోను. కాని ప్రజాకర్షకమైన (అచ్చతెలుగులో చెప్పాలంటే జనాలకి ఎక్కే) సమాధానాన్ని లేదా వివరణని తయారుచేసుకోవాలి. ఈ కాలంలో ఎంత బాగా present చెయ్యగలుగుతున్నాం అన్నదే కదా ముఖ్యం!
తెలుగుభాషా ప్రచారంలో చేసే ఏ పనికైనా నేను తప్పకుండా నా చేతనైనది చేస్తాను.
e-తెలుగు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి మాత్రమే పరిమితమన్న దృష్టితో "తెలుగుభాషాప్రచారసమితి" అని కొత్త గుంపు పెట్టాను. మీరుకూడా బయటి ప్రపంచంలో తెలుగు ప్రచారానికి నడుంబిగిస్తే, అందరమూ ఒకే గుంపుగా మన ప్రయత్నాన్ని సాగించ వచ్చు.

చదువరి గారు, నేను కిరణ్ గారు

చదువరి గారు,
నేను కిరణ్ గారు ప్రతిపాదించిన చర్యలను బలపరుస్తున్నాను. అలా తెలుగు పుస్తకాలను బళ్ళలో ఇవ్వడానికి , గ్రంధాలయాలను ఏరపచడానికి మనం సిద్ధమైతే, నేను కొన్ని పుస్తకాలను కొని ఇవ్వగలను. అయితే పుస్తకాలు ఇవ్వడం తో సరిపెట్టక అవి వారు చదువుతున్నారా లేదా అనే విషయం పై మనం వారిపై ఒక కన్నేసి ఉంచాలి.

సుజాత(మనసులో మాట)

వేమన గారు చెప్పినట్లు ..

వేమన గారు చెప్పినట్లు .. ఆత్మశుద్ది లేని యాచార మది యేల? భాండ శుద్ధి లేని పాక మేల? చిత్త శుద్ధి లేని శివ పూజలేల? అన్నట్లు.. మనలోనే మనకు తెలుగు భాషమీద సదభిప్రాయం లేనప్పుడు.. ఏదో చేసేద్దాం అని గొడవ చేయడమేల? ముందుగా ఇక్కడ స్పందించే ప్రతి ఒక్కరూ అస్సలు తెలుగు అంటే శ్రధ ఉన్నవాళ్ళా? అయితే తెలుగుని ఎందుకు బృష్టు పట్టిస్తున్నారో ఆలోచించరే.. వ్యవహార భాష తప్పని సరిగా అవసరమే.. కాదనను, అంత మాత్రాన తెలుగు స్వభావాన్ని తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తిస్తున్న మీరా తెలుగు అబ్యోదయాన్నికి పాటు పడేది? ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది.

తెలుగు భాష యెడల మనలోనే లేని స్వశ్చత ఇతరులలో రావాలని మనం కోరుకోవడం అతిశయోక్తి కాదా? ఇక్కడ స్పందిస్తున్న వారందరూ అంతర్జాలంలో చిఱ పరిచితులై ఉండవచ్చు, కాదనను.. స్వప్రయోజనాల కోసం తెలుగుని .. తెలుగు ప్రాభవాన్ని .. తెలుగుని అభివృధి పరచాలనే ఆలోచనని తమ తమ ప్రాచుర్యానికి ఉపయోగించ వద్దని నా మనవి. గుఱువింద గింజ తన ముడ్డి క్రింద ఉన్న నలుపుని గమనించ కుండా ఎదుటివారిని ఎత్తి పొడుస్తున్న విధంగా ముందుగా మీరందరూ తెలుగు స్వశ్చతను అలవఱుచుకుని ఇతరులను తెలుగుని పాటించ మనే ఆలోచన గురించి స్పందిస్తే మంచిదని నా మనవి.

ఇంట గెలవలేని వారు రచ్చ గెలిచి లాభమేమిటని ఒక్క సారి ఆలోచించ గలరు!!! తాము మారరు గానీ ఎదుటి వారు మారాలని అనుకోవడం ఎంతవరకూ సబబో మీరే ఆలోచించు కోవలసిన విషయం. ఇందు మూలంగా సజ్జనులందరికీ తెలియజేయునదే మనగా.. వ్యవహార భాష అంటూ తెలుగుని భృష్టు పట్టించకండి. తెలుగుని ముందు తమరు పాటించి ఇతరులకు తెలియజేయండి. అదేదో సామెత చెప్పినట్లు, సలహాలు ఎదుటివారు పాటించడానికే ఉన్నాయంట, కానీ స్వయంగా పాటించడానికి కాదన్నట్లు.. సామెతలు చెప్పకండి, ముందు మీరు పాటించండి.. మిగిలిన వాళ్ళు మిమ్ములను అనుసరిస్తారు.

చక్రవర్తి గారూ, మీరు

చక్రవర్తి గారూ,

మీరు ఉదహరించిన మూడు అంశాలకు నా ఉద్దేశాలను చెప్తాను
(1)"మనలోనే మనకు తెలుగు భాషమీద సదభిప్రాయం లేనప్పుడు.."
ఇది చాలా దారుణం. అభిమానం లేకపోతే ఈ చర్చే ఉండేది కాదు
(2)"తెలుగు భాష యెడల మనలోనే లేని స్వశ్చత ఇతరులలో రావాలని"
మన తక్షణ కర్తవ్యం - తెలుగుభాష అంతరించి పోకుండా మనం చెయ్యగలిగినది మనం చెయ్యటం.
అంతేకాని ఎవరిది స్వచ్చమైన తెలుగు అన్నది కాదు
(3)వ్యవహార భాష అంటూ తెలుగుని భృష్టు పట్టించకండి.
మీరు ఎక్కడో జరిగినది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యటం సరికాదు.
దయచేసి మీ సలహాలను ఇవ్వండి. ఈ కృషిలో మీ వంతు సహకారాన్ని అందించండి
-దూర్వాసుల పద్మనాభం

నాకొచ్చిన ఆలోచన ఎంతవరకు

నాకొచ్చిన ఆలోచన ఎంతవరకు ఆమోదయోగ్యమౌతుందో తెలియదుగాని నేను ఇస్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఆశ ఉండేది. నాకొచ్చిన సిన్ని సిన్ని పిచ్చి రాతలన్నీ మూటగట్టి, ఆ మాటల్నే మహాకావ్యాల్లా చదివుకుని మురిసిపోయే పెద్దోళ్ళకో, నా స్నేహితులకో సూపించుకోవాలని :)

ఒకానొక సమయంలో మాలో ఇలాంటి ఆసక్తి గమనించిన మా ఇంగ్లీషు టీచరమ్మ, మీకు తోచింది రాసి నాకివ్వండి, నలుగురూ బావుందంటే స్కూల్ నోటిస్ బోర్డ్ లోనో, లైబ్రరి లోనో పెట్టిస్తానన్నారు. కాని, ఆవిడ ఇంగ్లిషు పంతులమ్మ కాబట్టి అందులోనే రాయించింది. నా 'butterfly' కవిత్వం ఇంకా అక్కడే ఉంది.

ఇక నా ఆలోచన ఇదీ...

మీకు దగ్గరున్న స్కూల్లల్లో పిల్లల్ని ఇలాంటి రాతల్ని రాసేలా ప్రోత్సహిస్తే వాళ్ళల్లో తెలుగు ఇంకా తెలుసుకుని, ఇంకా బాగా రాయాలన్న కసి పెరుగుతుంది. నిజమండీ బాబూ :) ఒక్కో స్కూలుకి బాగా రాసే పిల్లలు ఒకరిద్దరున్నా ఈ ప్లాను పండినట్టే! మన విత్తు మొలకెత్తినట్టే!! వాళ్ళు రాసినవాటిల్లో మంచి మంచివి కొన్ని పత్రికల్లోనో, టీవీ చానల్లలో వచ్చే వినోద కార్యక్రమాల్లోనో వేయించగలిగితే మరింత ఉత్సాహాన్నిస్తుంది. అక్కడ, వాళ్ళు ఏదో సహాయం కోసం తీగలు వెదికే సమయానికి, వాళ్ళకు దొరకాల్సిన తెలుగు సాహిత్యాన్ని అందించగలిగామో, తెలుగు భాష పంట పండినట్టే. ఇది ఎలా చేయలన్నది ఈ చలికాలం సెలవలకి ఇంటికెళ్ళాక కొన్ని ప్రయోగాలు చేసి తెలుసుకోవాల్సిన విషయం. ఇక పుస్తకాలు చదవరన్న అనుమానం వద్దండి. ఎందుకంటారా, ఇదో అంటు వ్యాది లాంటిది. ఇంకా విద్యార్థి జీవితం లోంచి బయటకు రాని నాకు, చిన్నప్పట్నుంచీ ఎన్ని ప్రదేశాలు మారినా, చుట్టూ మనుషులెంత మంది మారిన, మారని ఒకే ఒక్క విషయం, విద్యార్థుల్లో ఆ ఆసక్తి, ఆ జిఙాసేనని బలమైన నమ్మకం, వాళ్ళల్లో ఆ కసి అలాంటిది! అదే, ఆ కసే, తెలుగు భాషని మళ్ళీ బంగారు యుగంలోకి నడిపించే శక్తని నా ప్రగాఢ విశ్వాసం.

దీని వల్ల తెలుగుకి, పిల్లలకి కలిపి కలిగే ప్రయోజనాలు.

1. స్కూల్లోనే విశ్వనాధ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కొకు, చిలకమర్తి, ఉన్నవ (ఇంకా ఎంతోమంది) లాంటి మహా మహా రచయితల గురించి తెలుస్తుంది. ప్రపంచ స్థాయి నవలలకి ఏ మాత్రం తీసిపొని వారి రచనలు పిల్లల్ని తెలుగు సాహిత్యం వైపు ప్రోత్సహిస్తాయి,

2. పిల్లలు వాళ్ళు రాసే రాతలు వాళ్ళకి నలుగురిలో గుర్తింపు తేవడం ఎంతో ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. సాహిత్యం వైపు వాళ్ళ బాటను సుగమం చేస్తుంది.

3. మనకి, వాళ్ళకి కొన్ని భేదాలున్నాయి. మనం ఎదైనా రాశామంటే, మన రాత మీద రకరకాల ప్రభావాలుండి చివరికి ఆ రాతలన్నీ ఒకే సముద్రంలో కలుస్తాయి. కాని వాళ్ళ వాతావరణం వేరు. "thinking out of box" అంటారే.. అక్కడ జరిగేది అదే!

నేను డిసెంబరు 13 న మా ఊరైన గోపవరం(ప. గో. జి) కి వెళ్తున్నా. ఈ లోపు మీరేమైనా సలాహాలిస్తే వాటిని కూడా, నాతో పాటు తీసుకువెళతా :)

గోపాల్ గారూ, మీ ఆలోచన

గోపాల్ గారూ, మీ ఆలోచన బాగుంది. ఈ విషయమ్మీద, మనం రచనల పోటీ కూడా నిర్వహించి, వెబ్‌లోను, అచ్చులోను ముద్రించే ప్రతిపాదనను కూడా పరిశీలించవచ్చు.

నవం 25 న ఈనాడులో వచ్చింది ఈ

నవం 25 న ఈనాడులో వచ్చింది ఈ వార్త!
-----------------------
చిత్తూరు జిల్లా కలెక్టర్‌ రవిచంద్ర చిత్తూరులోని ఓ పుస్తకాల దుకాణం వద్దకు వెళ్ళి, 'నేనొచ్చిది తెలుగు కోసం. దుకాణం పేరును తెలుగులో రాస్తేనే అందరికీ అర్థమౌతుంది కదా. పైగా అధికార భాషా చట్టమంటూ ఒకటుంది. చట్టాన్ని అందరం గౌరవిద్దాం.. తెలుగులోనే దుకాణాల పేర్లు రాద్దాం..' అని సూచించారు. రెండ్రోజల్లో తెలుగులోకి పేరు మార్పిస్తామని దుకాణదారుడు కలెక్టర్‌కు విన్నవించారు. ఇలా మాటల్లో చెప్పుకుని వదిలేస్తే సరిపోదనుకున్నారేమో కలెక్టర్‌.. తన వెంట రెండు రకాల పత్రాలు తీసుకొచ్చారు.

అందులో ఒకటి: ఇప్పటికే తెలుగులో దుకాణాల పేర్లు రాసిన వారికి అభినందన లేఖ.
రెండోది: తెలుగులో పేర్లు రాయని దుకాణదారుల దగ్గర వెంటనే తెలుగులోకి మార్పిస్తామని రాయించుకునే హామీ పత్రం.

ఆ దుకాణదారు వద్దనుండి ఆయన హామీ పత్రం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి ఫొటోస్టుడియో పేరు కూడా పూర్తిగా ఇంగ్లీషులోనే ఉండటంతో దుకాణదారుడి నుంచి వెంటనే పేరు మార్పిస్తామని హామీ పత్రం దగ్గరుండి మరీ రాయించుకున్నారు. ఎదురుగా ఉన్న మరో చెప్పుల దుకాణం పేరు తెలుగులోనే ఉండటంతో అక్కడికెళ్లి అభినందన లేఖ అందజేశారు.
------------------------

గోపాల్ గారు చెప్పిన దానికి

గోపాల్ గారు చెప్పిన దానికి మరికొంత...
కొన్ని ఆంగ్ల పత్రికల్లోను, ఛానల్స్ ఇప్పటికే క్విజ్‌లు, వ్యాసరచనల పోటీలు పెడుతున్నారు. అవి కేవలం ఆంగ్లానికే పరిమితమైపోతున్నాయి. మరి మన తెలుగు ప్రసార మాధ్యమాలు ఇలాంటివి ఎందుకు చెయ్యవో! ఈ విషయమై ఆయా ప్రతినిధుల్ని కలిసి తెలియజేస్తే బాగుంటుంది. ఈటీవీ-2 మీద మనం ఆశలు పెట్టుకోవచ్చు.

ఎలాగూ మనవాళ్లు గోలచేసో గగ్గోలుచేసో ఉన్న పురాతనత్వాన్ని అధికారికంగా మళ్లీ ఆపాదించారు కాబట్టి ఇప్పుడిక రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ తప్పకుండా తెలుగుని భోధించాలని ఒక ప్రభుత్వాజ్ఞను జారీ చేయించొచ్చు. అదికూడా ఆ తెలుగు అధ్యాపకులు తెలుగును భోదించగలిగే సరైన పట్టా ఉన్నవాళ్లు మాత్రమే ఉండేలా చూడాలి. లేకపోతే ఆ గంటసేపూ పాఠశాల ఆటశాలైపోతుంది. అధికార భాషా సంఘం ప్రతినిదిలు గానీ, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలు/సంఘాలు, ఔత్సాహికులు (e-తెలుగు వంటివి) ఆయా స్కూళ్లకు వెళ్లి తనికీలు చేసి ఒక నివేదిక సమర్పించొచ్చు (ఈ విషయం ప్రభుత్వం జారీ చేసే ఆజ్ఞలో ఉంటేనే ఈ విషయం ఆయా పాఠశాల నిర్వాహకుల బుర్రల్లోకి ఎక్కితుంది :-) ).

పైన చదువరిగారు చెప్పిన కలెక్టరు వార్తని తీసుకుందాం. రాజెలాగో ప్రజలలాగ కాబట్టి మనమెంతమంది చెప్పినా వినిపించుకోని వాళ్లు కూడా ఇలాంటి ఉన్నతాదికారులు స్వయంగా రంగంలోకి దిగుతున్నారని తెలిస్తే ఆలోచిస్తారు. కాబట్టి మనం స్వచ్ఛందంగానైనా సరే ఇలాంటి ఉన్నతాధికారులను కలిస్తే బాగుంటుంది.

తల్లిదండ్రులలోనూ అవగాహన కలిగించాలి. చాలామంది తమ పిల్లలకు పేర్లుపెట్టకముందే వాళ్లని సాఫ్ట్‌వేర్ ఇంజనీరనో డాక్టరనో చేసేస్తున్నారు. వాళ్లకి విజ్ఞానాన్ని, పౌష్టికాహారాన్ని ఇవ్వడంతో పాటు కాస్త మన సంస్కృతిని కూడా వంటబట్టించేలా చెయ్యాలి.
మనమెప్పుడైతే మన సంస్కృతిని పదిలపరచుకోవాలని చూస్తామో అప్పుడు మిగిలినవి అవే మనతో మనగలుగుతాయి.

చదువరి గారికి కృతఙతలు. నేను

చదువరి గారికి కృతఙతలు.

నేను చెప్పింది పాఠశాలల్లో, కాలేజీల్లో ఉండే విద్యార్థుల్లో అవగాహనకు ఉపయోగపడుతుంది.

శ్రీనివాస గారు చెప్పింది కూడా బావుంది. ఇక్కడున్న ఎవరైకైనా కాస్త అలాంటి అధికారులతో పరిచయం ఉంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఐతే ఇళ్ళల్లోకి కూడా ఈ వార్త ప్రసరిస్తుంది, ప్రభావం చూపుతుంది. కాని అది ఒకరోజు మాత్రమే వినిపించి ఆగిపోకూడదు. దాని ఆనవాళ్ళు ఏదో ఒక సంధర్భంలో, వాళ్ళ నిత్య జీవితంలో ప్రజలు గమనించేలా రూపొందించాలి.

నా వరకు నాకే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి, అవుతున్నాయి. పట్టణాల్లో ఉండే మన బంధువులే, పిల్లలకి ఇంగ్లీషొక్కటే నేర్పించుకుని అదేదో గొప్ప విషయంలా చాటుకుంటారు! నేను ఇంగ్లిషు భాషకి వ్యతిరేకినీ కాను,శత్రువునీ కాను. కాని కేవలం వృత్తికోసం మాత్రమే ఆలోచించే వాళ్ళ దోరణి చూస్తే ఒక పక్క బాధగానూ, ఇంకోపక్క జాలిగానూ ఉంది.

ఇంకా ఇలాంటి సంఘటనలు స్నేహితుల మధ్య కూడా ఎదురవుతున్నాయి. చెప్తే చెప్పినంత సేపు వింటారు. తర్వాత షరా మామూలే! కనీసం ఇలా అన్ని కోణాల నుంచి వాళ్ళకి తెలియజెప్తే తెలుస్తుందేమో.

ఇక్కడ తెలుగు గురించి ఈ విధంగా

ఇక్కడ తెలుగు గురించి ఈ విధంగా చర్చింకుంటున్న వారికి నాదొక చిన్న మనవి. గోపాల్ గారు చెప్పినట్లు, ప్రస్తుత సమాజంలో చాలా మంది ఇంగ్లిష్ ని పిల్లలకు చిన్నతనం నుండీ నేర్పించుచూ, వాళ్ళ నోటి వెంట, అమ్మా, నాన్నా అని కూడా పిలిపించుకోలేకుండా, mummy, daddy అని పిలిపించుకుంటున్నారు. ఇలా మీ పిల్లలు కూడా చేస్తూ ఉంటే, ఒక్క సారి అలోచించండి, ఒక్క విషయం, మన తెలుగు లో ఒక సామెత ఉంది, "మొక్కై ఒంగనిది మానై వంగుతుందా" అని. ఇలా చిన్నతనం నుండే వారికి తెలుగు గురించి అవగాహన కలిగించండి.

PS: As gopal said, Im also not opposite for English.

--
Purush

పురుషోత్తం గారూ, మీ ఉద్దేశ్యం

పురుషోత్తం గారూ, మీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది. మీరు చెప్పింది నిజం. ప్రస్తుతం లోకం పోకడ పరిశీలించిన వారికి మీకు కలిగిన సందేహాలు కలగడం సహజమే! మీ సందేహాలను నేను నివృత్తి చెయ్యదలచాను.

ఇక్కడ వ్యాఖ్యానించిన వారు e-తెలుగులో చురుగ్గా ఉంటున్నవారే. ఇవ్వాళ మనకు దొరుకుతున్న సాఫ్టువేర్లు తెలుగీకరణ చెయ్యడంలో ఇక్కడివారు కూడా మంచి పాత్రే పోషించారు. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం ఇతర పెద్దలతో కలిసి వీరు కృషి చేసారు. తెలుగు పట్ల వారి నిబద్ధతను శంకించనవసరం లేదని నమ్మకంగా చెప్పగలను - వారు ఇంటగెలిచి రచ్చగెలిచేవారే. :)

మీ అభిమానపూర్వక మార్గదర్శకత్వానికి, సూచనలకు నెనరులు. మీనుండి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తాను.

1. తెలుగు వారోత్సవాల లాంటి

1. తెలుగు వారోత్సవాల లాంటి పనులు అస్సలు వద్దు - ఇది పూర్తిగా తప్పు దిశ.
సంస్కృతాన్ని చూడండి. సాధారణ మనుషులు సంస్కృతం ఉపయోగించేది, పూజలు గట్రా చేసేప్పుడు మాత్రమే. తెలుగుని కూడా అలా కానివ్వకండి. మనం తెలుగు కవితోత్సవాలు, పోటీలు అని పెడితే, ఓహో, తెలుగు భాష ఇలాంటి వాటి కోసం మాత్రమే అని ముద్ర పడుతుంది. అదీ కాక, ఇటువంటి కార్యక్రమాన్ని ఏదో ఒకటి రెండు సార్లు నిర్వహించవచ్చు గానీ క్రమబద్ధంగా నిలిపి ఉంచడం కష్టం.
2. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ ప్రజలకి ఎక్కువ ఉపయోగించే ఒక కార్యాలయాన్ని ఎన్నుకోండి. ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అనుకుందాము. అక్కడ ఉండే దరఖాస్తు ఫారాలు అన్నీ నమూనాలు సంపాదించి తెలుగులో తర్జుమా చెయ్యండి. అలాగే అక్కడ ప్రజలు వేచి ఉండే ప్రదేశాన్ని బాగా పరిశీలించి ఎన్ని సూచనలు తెలుగులో ఉన్నాయో గమనించండి. వాటిని కూడా తెలుగులో తర్జుమా చేసి, ఈ రెండిట్తోనూ ఆ కార్యాలయపు అత్యున్నత అధికారిని కలిసి మెమొరాండం ఇవ్వండి. వీటిని తెలుగులో అమలు చెయ్యాలి అని.
ఇదైనాక ఇంకో కార్యాలయం. మంత్రులు పోర్టుఫోలియోలు తీసుకున్నట్టుగా సభ్యులు ఒక్కొక్క ఆఫీసు గుత్తకి తీసుకుని ఆ వత్తిడిని సమతుల్యంగా చూసుకుంటూ ఉండాలి.
3. ఇలాగే పెద్ద పెద్ద స్టోర్ల లో కూడా. కానీ ఇదెంత సమర్ధవంతంగా జరుగుతుందో నాకు అనుమానమే.
4. వ్యక్తిగతంగా అందరమూ ప్రతిజ్ఞ చేసుకోవాలి. అవతలి వ్యక్తికి ఏమాత్రం తెలుగు వచ్చినా, సంభాషణ తెలుగులోనే చేస్తామని, మన దైనందిన కార్యక్రమాలన్నిటిలోనూ. ముఖ్యంగా పిల్లలతో (ఏ వయసు వారైనా) మాట్లాడేటప్పుడు.

కొత్తపాళిగారితో నేను

కొత్తపాళిగారితో నేను ఏకీభవిస్తున్నాను. పోటిలూ, వారోత్సవాలలో పాల్గొనేది ఎక్కువగా తెలుగు మీద అప్పటికే అభిమానమున్నవారే.
నా ఉద్దేశంలో తెలుగువాళ్ళు తెలుగుభాషని తక్కువగా చూడ్డానికి మూల కారాణాలు మూడు:
1. ఇంగ్లీషు మాట్లాడడం (తెలుగు మాట్లాడకపోవడం) నాగరిక లక్షణం అనే భావన
2. ఇంగ్లీషు నేర్చుకోడానికి తెలుగుని విస్మరించాలి అనే నమ్మకం
3. తెలుగు లేకపోయినా పని జరిగిపోతుందిలే అన్న ధైర్యం

మొదటి దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే, ప్రచారసాధనాల సహాయం తప్పదు. ఆ మధ్య అధికారభాషాసంఘమూ, తెలుగు దూరదర్శనూ సంయుక్తంగా టీవీ ఏంకర్లకి తెలుగుభాష మీద ఒక వర్క్ షాపు నిర్వహించారట! అదెంతవరకూ సఫలమయిందో తెలీదు. బహుశా అధికారభాషాసంఘం అదో మొక్కుబడిగానే కానిచ్చిందేమో. బాలసుబ్రహ్మణ్యం లాంటి పెద్దవాళ్ళనే కాకుండా, తెలుగుపై అభిమానం ఉన్న ఈ తరం ప్రఖ్యాత వ్యక్తులని పట్టుకొని, వాళ్ళ ద్వారా తెలుగుభాష మాట్లాడకపోవడం నాగరికత కాదని ప్రచారం చెయ్యాలి. టీవీ చానళ్ళలో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేలా వత్తిడి తేవాలి.
రెండవ సమస్యని పరిష్కరించడానికి స్కూళ్ళని ఆశ్రయించవచ్చు. టీచర్ల ద్వారా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది.
మూడవ సమస్యని ఎదుర్కోడానికి కొత్తపాళీ గారి సూచన ఉపయోగపడుతుంది.

కొత్తపాళీ గారు చెప్పిన ప్రతిజ్ఞని నేను అమలుచేస్తున్నాను. మా అమ్మాయి మాటల్లో ఇంగ్లీషు పదాలు దొర్లినప్పుడల్లా, ఆ మాటలని తెలుగులో మళ్ళీ చెప్పేదాకా ఊరుకోవటం లేదు :-)

ఈ లెక్కన చాలా ముఖ్యమైనది,

ఈ లెక్కన చాలా ముఖ్యమైనది, నేను ఇందాక మరచినది, బేంకులు.
బేంకులో ఉపయోగించే వివిధ ఫారాలకీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాల ఫారాలకీ, దరఖాస్తులకీ తెలుగు నమూనాలు తయారు చేసి మన గూట్లో ఉంచాలి, జనాలు ప్రింటు తీసుకో గలిగేట్టు.
అలాగే, ఇంకా కొన్ని మూస దరఖాస్తులు, అర్జీలు కూడా రాసి వాటి నమూనాలు ఉంచాలి.
యువతని ఆకట్టుకోవాలని గోపాల్ చేసిన సూచన బాగానే ఉంది కానీ కేవలం పోటీల వల్ల కాదు. అందులో రెండు లొసుగులు ఉన్నై. ఒకటి - గెల్చేవారు అప్పటికే తెలుగు వాడకం బాగా వచ్చిన వారై ఉంటారు. రెండు - ఇదేదో ఒక వారం జరుగుతుంది, మళ్ళి యధా ప్రకారం మామూలే. కొంచెం దీర్ఘకాల ప్రభావం చూపే దిశగా ఆలోచించాలి. నాకు ఒకటి అనిపిస్తోంది. తెలుగు మాట్లాడ్డం, రాయడం కూడా స్టైలిష్ అనే భావన కలిగించాలి, స్కూల్లోనూ కాలేజిలోనూ. అదెలాగో ఆలోచిస్తే బాగుంటుంది.

నవంబరు,2008 విపులలో

నవంబరు,2008 విపులలో ప్రచురించబడిన ఈ క్రింది వ్యాసం తెలుగు భాష వాడుకకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుందనుకుంటాను. దయచేసి చదవండి.

http://www.eenadu.net/vipnew3/display1.asp?url=vip-kathalu13.htm

దుర్వాసుల పద్మనాభం

కొత్తపాళీ గారి సూచన మేరకు జనన

కొత్తపాళీ గారి సూచన మేరకు జనన నివేదికకు ధరఖాస్తు (Birth certificate application) ను http://vizagdaily.co.cc/?p=81 లో ఉంచాను.ఆసక్తి గలవారు దించుకొనవచ్చును.
అలాగేవీలువెంబడి మరికొన్ని ధరఖాస్తులు కొరకు ప్రయత్నించి మీ అందరితో పంచుకోగలను.

తెలుగెందుకు? ఇది మనలో

తెలుగెందుకు?
ఇది మనలో చాలామందికి వస్తున్న సందేహం. ఆచార్య ఆర్వీయస్. సుందరం మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు, విపుల, ఆగస్టు 2007 సంచికలో దీని గురించి వ్రాసిన వ్యాసం లో చర్చించారు. దాని పూర్తి పాఠం ఇక్కడ
చూడవచ్చు.

-దూర్వాసుల పద్మనాభం

http://edesam.blogspot.com/

ఎందుకో కొత్తపాళి గారితో

ఎందుకో కొత్తపాళి గారితో ఏకీభవించలేకపోతున్నాను :)

ఇంగ్లిషులో ఇలాంటివి సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాని ఆ భాషని మనవాళ్ళు అలాంటి వాటికి మాత్రమే వాడాలన్న కట్టుబాటేమి చేసుకోవటంలేదు కదా. మీరు చెప్పినట్టు ఏ పరీక్ష లాగో ఏడాదికోసారి పెడితే కష్టమే. అందుకే నేను కొన్ని ప్రయోగాలు చేస్తానన్నాను. అందులో ఒకటి, నాకు తెలిసిన కొంతమంది ఉపాధ్యాయులున్నారు మా ఊరి చాయల్లో. అలాగే కొన్ని స్కూల్లు కూడా ఉన్నాయి. ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి, దీన్ని పాఠశాలలోనే తెలుగు చెప్పే విధానంలో కలిసిపోయేలా ఏమన్నా చేయగలమేమో ఆలోచించి తర్వాత అమలుపరుద్దామని నా అలోచన.

మనం చేసే పని సుధీర్ఘ కాలం పాటు నడవాలన్న మీ అలోచనకు కృతఙతలు :)

పై చర్చనంతా చదివాను.

పై చర్చనంతా చదివాను. కామేశ్వరరావుగారితో నేను ఏకీభవిస్తున్నాను. తెలుగు మాట్లాడడం అనేది తక్కువతనం కాదు అనే భావన పిల్లల్లో .. ముఖ్యంగా యువతలో కలిగించగలిగితే అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంగ్లీషు మాట్లాడడానికి తెలుగు విస్మరించాలి అనేకన్నా, మన మాతృభాషలో బాగా పట్టు ఉంటే మరొక భాష బాగా నేర్చుకోగలమన్న భావన అందరిలో మనం కలిగించాలి. ఇప్పుడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు చాలా మంది తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారే. ఆ విషయాన్ని మనం బాగా అందరి దృష్టికీ తీసుకెళ్ళాలి. మా నాన్నగారు / తాతగారి తరంలో కార్యాలయాల్లో మొత్తం ఇంగ్లీషులోనే తమ కార్యకలాపాలు సాగించినా, వారెవరూ తెలుగుని చిన్నచూపు చూడలేదు. వారిలాగా మంచి ఇంగ్లీషులో అన్ని రకాల పనులకూ ఈ తరం వారు ఇంగ్లీషులో ఉత్తర ప్రతుత్తరాలు సాగించలేరు.. కానీ ఇంగ్లీషు చదువుకోవడమే గొప్ప అనే భ్రమలో ఉన్నారు చాలామంది. ఆ భ్రమని మనం పోగొట్టగలిగితే చాలు. దానికి పాఠశాలలు, కళాశాలలు, ఎలక్ట్రానిక్ మీడియా (ఇంటర్నెట్, టీవీ, ఎఫ్.ఎం రేడియో)...అన్నిటినీ వేదికలు గా చేసుకోవాలి. మరొక ప్రయత్నం మా వంతుగా, మా కార్యాలయంలో "తెలుగు సాహితి" అనే పేరుతో తెలుగు సాహితీ సమావేశాలను ప్రతీ నెలా నిర్వహించబోతున్నాము. ఇలాటి ప్రయత్నాలు వేలకు వేలు తెలుగు వారు పనిచేసే కంపనీల్లో జరిగితే కొంత మన భాషా వ్యాప్తికి దోహదపడుతుందని - తెలుగు మాట్లాడడంలో, చదవడంలో, రాయడంలో మన భాషలో ఉన్న సౌందర్యాన్ని అందరూ ఆస్వాదిస్తే, తెలుగు భాష మీద మమకారం అందరికీ పెరుగుతుందని నా భావన. మా "తెలుగు సాహితి" కార్యకలాపాలు స్థిరీకరించాక, కనీసం కొందరు భాషాభిమానులనైనా మీరు చెప్పే ఆచరించదగ్గ ఉమ్మడి కార్యక్రమాల్లో పాలు పంచుకోడానికి మా వైపునించీ సిధ్ధంగా ఉంచగలమనే ఆశతో ఉన్నాను.

తెలుగెందుకు? అనే ప్రశ్న మీద

తెలుగెందుకు? అనే ప్రశ్న మీద జరిగిన చర్చ కొంతవరకు చదివిన తరువాత నాలో వచ్చిన స్పందన ఇది. ప్రపంచంలో ఈ ప్రశ్నని వేసిన ఘనత ఒక్క తెలుగువాడిదే అని నా అనుమానం. ఒక రష్యా వాడు కాని, జెర్మనీ వ్యక్తి కాని, జపనీయుడు కాని, మెక్సికో వనిత కాని ఈ రకం ప్రశ్న వేసినట్లు లేదు. మన తెలుగువాళ్ళకి (భారతీయులతో పాటు) మరొక ప్రత్యేకత ఉంది. మన పేర్లు రాసుకునేటప్పుడు పేర్ల ముందు పొడి అక్షరాలని ఇంగ్లీషు లిపిలో రాసుకుంటాం. ఉదాహరణకి: K. L. రావు, N. T. రామారావు, వగైరాలు. జపానులో కాని, చైనాలో కాని ఈ పరిస్థితి మనకి ఎప్పుడూ ఎదురవదు: M. T. టుంగ్ అంటే ఎంతమందికి తెలుస్తుంది? ఎందుకనో తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు అంటే మమకారం అలా పెరిగిపోయింది. పోనీ అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషు రచనలు చేసి పేరు ప్రతిష్ఠలు సంపాదించిన తెలుగువాళ్ళెంతమంది ఉన్నారు? ప్రతిభని పక్కకి పెడదాం. తెలుగెందుకని నిలదీసి ప్రశ్నించే పెద్దలు ఎంతమంది ఇంగ్లీషులో తప్పులు లేకుండా రాయటం, చదవటం చెయ్యగలరు? కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్‌క్లి) లో తెలుగు పీఠం స్థాపించే ప్రయత్నంలో చందాలు దండుతూ చెయ్యి జాపితే ఇచ్చినవాళ్ళు ప్రశ్నించకుండానే ఇచ్చేరు, ఇవ్వని వారు మాత్రం "మనకి తెలుగెందుకండీ?" అనో, లేక "అమెరికాలో మనకి తెలుగెందుకండీ?" అనో నిలదేసి అడిగేరు. దీనికి సమాధానంగా ఇంగ్లీషులో ఒక కరపత్రం తయారు చేసి వారందరికీ ఇచ్చేం. దానిని తెలుగులో తిరగరాసి మరొక చోట ప్రచురిస్తాను; అది వేరే విషయం. కాని ఒక తెలుగు వ్యక్తి మరొక తెలుగు వ్యక్తికి "మనకి తెలుగెందుకు?" అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి రావటం గమనార్హం.

ప్రశ్న వచ్చిందని ఆశ్చర్యం,

ప్రశ్న వచ్చిందని ఆశ్చర్యం, ఆవేదన, నిస్పృహ వ్యక్తపరచవచ్చు, సిగ్గుపడవచ్చు, తాత్త్విక చింతనా చేయవచ్చు. ముందే చెప్పినట్టు ఖర్మ అని నెత్తినోరు కొట్టుకోవచ్చు, ఈ పేజీలో జరుగుతున్నట్టు ఎడతెగని చర్చా చేయవచ్చు, కానీ చివరకు..
ఈ తరానికి తర్కం, తాత్త్వికత అవసరం లేదండి. సులువుగా ముద్రవేసే నినాదాలు మాత్రమే కావాలి. it's battle for the mind out there. think in terms of symbols, signs, slogans, sub-conscious ఉదాహరణకి సిగరెట్ వ్యాపారప్రకటనలు

ఇ - తెలుగు,ఈ - తెలుగు ఏది

ఇ - తెలుగు,ఈ - తెలుగు ఏది సరైనది? ఒకొక్కరు ఒకొక్క విధంగా వ్రాస్తున్నారు.

రెండూ కాదు. e-తెలుగు అన్నది

రెండూ కాదు. e-తెలుగు అన్నది సరైనది.

తెలుగు బాషాభివ్రుద్ధికి

తెలుగు బాషాభివ్రుద్ధికి కొన్ని చిన్న పనులు చేస్తె చాలు. 1) మీరు మాట్లాడెటప్పుడు తెలుగు సంఖ్యలను వారాలను వాడుతున్నారా. 2) ఇతరులకు తెలుగులోనే సంఖ్యలను వారాలను మాట్లాడమని చెప్పుతున్నారా 3) తెలుగు బాషలొ వచ్చె కొత్త పదాలను తెలుసుకుంటున్నారా.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer