ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే విషయం మీద నేను ఒక పుస్తకాన్ని, ఒక బ్లాగునీ రాశాను.

ప్రాధమిక వాస్తవం అయినటువంటి సమాచారానికి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రభుత్వ నిర్వహణలో సమాచార సక్రమ యాజమాన్యం, వినియోగం ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తేగలుగుతుంది, ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగపు విలువ, పద్దతి, అవసరం, అగత్యం, సందర్భాలని గురించి దానిలో చర్చించాను.

మన జీవితాలని ఎన్నో విధాలుగా కంప్యూటర్లు ప్రభావితం చేస్తున్నాయి. ఈ కంప్యూటర్ల గణన సామర్ధ్యాలని మన జీవితాలతో పాటుగా మన వ్యవస్థని కూడా సక్రమం చేసుకోవడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో చర్చించడానికి మీ అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాను.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer