e-తెలుగు హైదరాబాద్ సమావేశం సెప్టెంబరు 2008 నివేదిక

వర్షభయం వల్లనో లేక తేదీ మార్చడం వల్లనో హాజరు అనుకున్నంతగా లేదు. వచ్చేవారి కోసం ఎదురుచూస్తూ గేటు బయటే ముచ్చట్లు మొదలుపెట్టాం. ఓ అరగంటాగి లోనికి వెళ్ళి యధావిధి స్థలంలో కూర్చోగానే, నేను వచ్చేసా అంటూ వర్షమూ మొదలయ్యింది. ప్రక్కనే ఉన్న చిన పెంకుల గోపురం క్రిందకి వెళ్ళి చర్చలు కొనసాగించాం.

ఈ నెల కొత్తగా అనిల్ కుమార్ వచ్చారు. ఈయన జెనెటిక్స్ పట్టభద్రులు మరియు ఆస్ర్టానమీలో ఆసక్తి ఉన్నవారు. వీరు పిల్లలకోసం తెలుగులో వైజ్ఞానిక వ్యాసాలు కూడా రాస్తారు. తెలుగుపదాని తోడ్పడాలని వీరి ఉవాచ.

హజరు:

  • పద్మనాభం
  • చల్లా అనిల్ కుమార్
  • దాట్ల శ్రీనివాసరాజు
  • వీవెన్
  • కట్టా విజయ్
  • చావా కిరణ్
పద్మనాభం, వీవెన్, అనిల్, చావా కిరణ్, విజయ్
పద్మనాభం, వీవెన్, అనిల్, చావా కిరణ్, విజయ్

విశేషాలు:
ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలలో క్రమంగా తెలుగు బ్లాగుల గురించి వ్రాస్తుండటం పట్ల సంతోషించాం. తెలుగులో అన్ని రకాల బ్లాగులూ కలిపి ఓ వెయ్యి వరకూ ఉంటాయని ఓ అంచనా. కూడలిని రోజూ సగటు 450 నుండి 500 వరకూ సందర్శకులు చూస్తారు. ఇతర సంకలినుల రద్దీ కలుపుకున్నా, చాలా తక్కువ మందికే చేరువలో ఉన్నాం. బ్లాగులని, వాటి సందర్శకులని పెంచాలని అందుకు ప్రయత్నాలు (ప్రదర్శనా పత్రాలు, మిత్రులకి మెయిళ్ళు, గట్రా) చెయ్యాలని ఎప్పట్లానే అనుకున్నాం.

పద్మనాభం, వీవెన్, అనిల్, చావా కిరణ్, శ్రీనివాసరాజు
పద్మనాభం, వీవెన్, అనిల్, చావా కిరణ్, శ్రీనివాసరాజు

చిరు జల్లులలో తడుచుకుంటూ ఫలహారశాలకి వెళ్ళి, కాఫీ సేవించి, వీడ్కోలు తీసుకున్నాం.

వ్యాఖ్యలు

ప్చ్....... సమావేశాన్ని

ప్చ్....... సమావేశాన్ని వాయిదా వేయించీ కూడా..
సెప్టెంబర్ 30 లోపల చేయాల్సిన పనుల వల్ల (చిదంబరం దే పాపమంతా) రాలేకపోయాను..

"..ప్రయత్నాలు (ప్రదర్శనా

"..ప్రయత్నాలు (ప్రదర్శనా పత్రాలు, మిత్రులకి మెయిళ్ళు, గట్రా) చెయ్యాలని ఎప్పట్లానే అనుకున్నాం."
ఇది బాగుంది