జూన్ నెల సమావేశం అధ్యక్షులు తుమ్మల శిరీష్ కుమార్ గారి అధ్యక్ష్యతన జరిగింది. మొత్తం తొమ్మిది మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో యూనికొడ్ గురించి పాత్రికేయులకు ఒక సమావేశాన్ని నిర్వహించాలని, ఎక్కడ ఎలా చేయాలని ప్రణాళిక గురించి చర్చించారు. "ఇంకా మనం బ్లాగులకు ఏమైనా చేయాలా!" అన్న చావా కిరణ్ గారి ప్రశ్నకు పద్మనాభం గారు ఇంకా వ్యాప్తి చెందాలని, తెలుగు భాషా పండితులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు!
వీవెన్ గారు వివిధ తెలుగు అనువాదాలగురించి వివరించారు, వర్డ్ ప్రెస్స్ అనువాదాలలో పాలుపంచుకోవాలంటే ఇక్కడ చూడమన్నారు. తుమ్మల శిరీష్ కుమార్ గారు సభికులకు అనువాదములలో పాలుపంచుకోవాలని అందరి అభిప్ర్రాయములు తెలుసుకున్నారు!
సమావేశానికి వచ్చినవారందరికి ఉబుంటు వారి లినక్స్ సిడిలను పంపిణి చేయటం జరిగింది, కొంతమంది లినక్స్ ఉపయోగములు తదితర వివరములు వీవెన్, చావా కిరణ్, వెంకటరమణలను అడిగితెలుసుకున్నారు.
కార్యవర్గ సభ్యులు e-తెలుగు కార్యక్రమ విధులగురించి, సంఘం గురించి చర్చించారు.
వరుణుడు భయపెడుతుండటంతో ఆరు గంటలకు సభ ముగించాం.
హాజరైన సభ్యులు:
1.ఉషా రాణి
2.వీవెన్
3.చావా కిరణ్
4.వెంకటరమణ
5.సి. భాస్కరరావు
6.కట్టా విజయ్
7.దుర్వాసుల పధ్మనాభం
8.దాట్ల శ్రీనివాసరాజు
9.తుమ్మల శిరీష్ కుమార్
వ్యాఖ్యలు
కందర్ప కృష్ణమోహన్
మిస్సయ్యానండీ...... మిస్సయ్యాను... ప్చ్..