చిరు ప్రయత్నం

Source: From Shankar Reddy (Bangalore Blogger team member)

అందరికి, చాలా రోజుల తరువాత అందరికి జాబు వ్రాస్తున్నాను. ఉభయ కుశలొపరి.
ఇక అసలు విషయనికి వస్తాను, ముఖ్యముగా ఈ జాబు ద్వార మీకు బ్లాగును పరిచయం
చేయబొతున్నాను. మీ లొ కొంతమందికి వీటి గురించి ఇప్పటికే తెలుసు
అనుకుంటాను. ఒక్క మాటలొ చెప్పాలంటే బ్లొగ్ అంటె డైరి. విటిని ఎవరైనా
అంతర్జాలములొ(ఇంటెర్నెట్) చదవవచ్చు లేక వ్రాయవచ్చును. మనకు తెలియని ఎన్నొ
విషయలు ఇక్కడ తెలుసుకొవచ్చు సినిమ, ఆటలు,పాటలు,వ్యక్తులు, కొత్త
ప్రదేశాలు ఒకటేమిటి ఎన్నో విషయలు తెలుసుకొవచ్చు . మీరు మీ సొంతంగా బ్లొగ్
లు వ్రాయవచ్చు. జరిగిన విషయలు జరుగుతున్న విషయలు వ్రాయవచ్చూ. వ్రాసిన
తరువాత వాటిని గుంపులొ పబ్లిష్ చెయవచ్చు. అలా వ్రాసిన బ్లొగ్ లను ప్రపంచ
వ్యాప్తంగ ఎందరో చదివి వారి అభిప్రాయలను వ్యక్తపరుస్తారు. ఇకపోతె ఈ
బ్లొగ్ లను ఏ బాష లొ అయినా వ్రాయవచ్చు. మన మాతృ బాష లొ వ్రాద్దాం. మన
మాతృ బాష ను మనం మరువకుండ మన తరువాతి తరాలకు అందిద్దాం .... మీలొని
సృజనాత్మకతను వెలికి తీయండి. మీ బ్లొగ్ ను మొదలు పెట్టండి.

తెలుగు లొ వ్రాయుటకు క్రింది సైటు ను చూడండి. http://lekhini.org/

ఈ బ్లొగ్ సెవలను క్రింది సైటు కలిగి ఉన్నయి. http://wordpress.com/

https://www.blogger.com/ ( https://www.blogger.com/ )ఈ సైటు కు మీ
జిమైల్ అకౌంట్ ను ఉపయుగించుకొవచ్చును.

నాకు ఓ బ్లొగ్ వుంది. నా బ్లొగ్ చుడలంటె క్రింది చిరునామ లొ చుడండి.
ఇప్పుడు ఇప్పుడె దినిని మొదలుపెట్టాను. http://ssreddyr.wordpress.com/

ఇంకా ఎందుకు ఆలస్యం మీరు మీ బ్లొగ్ ను మెదలుపెట్టండి.

క్రింది చిరునామా లో అన్ని రకాల బ్లొగ్ లను వీక్షించ వచ్చు....

http://koodali.org/ http://www.jalleda.com/http://www.thenegoodu.com/

ఇట్లు

మీ శంకర్

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer