e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం, 2008 మే 18 న హైదరాబాదు, వెంగళరావు నగర్ లోని సి.బి.రావు గారి ఇంటిలో జరిగింది.
సమావేశం సాయంత్రం 4:45 కు మొదలైంది.
సమావేశ ఆవశ్యకతను వివరిస్తూ సంఘ అధ్యక్షుడు తుమ్మల శిరీష్ కుమార్ ఇలా అన్నారు: సంఘం రిజిస్ట్రేషను జరిగిన తరువాత, కార్యవర్గ కూర్పును సమీక్షించి అవసరమైన మార్పుచేర్పులు చెయ్యాలనే ఉద్దేశ్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేసాం.
హాజరైన సభ్యులు
1. వీవెన్
2. దూర్వాసుల పద్మనాభం
3. పలివెల కృపాల్ కశ్యప్
4. చావా కిరణ్ కుమార్
5. దాట్ల శ్రీనివాసరాజు
6. సి. భాస్కరరావు
7. ఉప్పల వెంకటరమణ
8. తుమ్మల శిరీష్ కుమార్
సమావేశం కింది విషయాలను పరిశీలించి తీర్మానాలు చేసింది:
1. సంఘ కార్యకలాపాల నిర్వహణకుగాను కార్యదర్శికి సహాయకంగా ఒక సంయుక్త కార్యదర్శిని అన్నుకోవాలని తీర్మానించడమైనది. దాట్ల శ్రీనివాసరాజును ఈ పదవికి ఎన్నుకోవాలని ప్రతిపాదన వచ్చింది.ప్రతిపాదించినవారు: సి.భాస్కరరావు. సమర్ధకులు: కృపాల్ కశ్యప్. తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
2. కార్యవర్గాన్ని బలోపేతం చేస్తూ మరొక సభ్యుని తీసుకోవాలని తీర్మానించడమైనది. దూర్వాసుల పద్మనాభం గారిని ఈ స్థానంలోకి తీసుకోవాలని తుమ్మల శిరీష్ కుమార్ ప్రతిపాదించగా, వీవెన్ దాన్ని సమర్ధించారు. తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
3. సంఘ సమావేశాల నిర్వహణ, కార్యవర్గ సభ్యుల మధ్య సమాచార నిర్వహణ మొదలైనవాటిని వెబ్‌లో నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది. సభ్యులంతా ప్రత్యక్షంగా ఒకచోట సమావేశమై చర్చించే కంటే వెబ్‌లో నిర్వహించడం వలన సభ్యుల సమయం ఆదా కావడమే కాక, విలువైన ధనం కూడా ఆదా అవుతుందని భావించడం వలన ఈ విషయాన్ని సమావేశం ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం-
అ) ఛాట్ కూడళ్ళలో సభ్యులంతా సమావేశమై కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక వారం రోజులు ముందుగానే సభ్యులందరికీ ఇమెయిలు ద్వారా తెలియపరుస్తారు.
ఆ) సమావేశ స్థలం లోకి ఇతరులు రాకుండా ప్రవేశాన్ని సంకేతపదంతో నియంత్రిస్తారు.
ఇ) సమావేశ వివరాలను (మినిట్స్ ఆఫ్ మీటింగ్) సంఘ అధికారిక వెబ్‌సైటు అయిన etelugu.org లో ప్రచురిస్తారు. సభ్యులు అ వివరాలను చదివి తమ ఎలక్ట్రానిక్ సంతకాలను చేస్తారు
ఈ) సంఘం ఒక బ్యాంకు ఖాతా తెరవాలని సమావేశం తీర్మానించింది.
ఉ) అంతర్జాలంలోని సంఘపు ఆస్తుల నిర్వహణ పట్ల సమావేశం ఇలా తీర్మానించింది: డొమెయిను పేరును ప్రతీ ఏటా రిజిస్ట్రారు వద్ద తిరగ రాయడం, సంఘ వెబ్‌సైటును నిర్వహించడం వంటి బాధ్యతలను వీవెన్‌పై ఉంచింది. ప్రస్తుతం ఈ ఖర్చు సంవత్సరానికి రూ.1500/- అవుతున్నది.
ఆ తరువాత సమావేశం కింది విషయాలను చర్చించింది.
1. తెలుగు విశ్వవిద్యాలయం వారి వెబ్‌సైటును తెలుగీకరించడం: విశ్వవిద్యాలయ వెబ్‌సైటును రీడిజైను చెయ్యవలసినదిగా రిజిస్ట్రారు కోరారని కృపాల్ కశ్యప్ చెప్పారు. అయితే సంఘం తెలుగీకరణకు, యూనీకోడీకరణకు అవసరమైన సాంకేతిక సహాయం చేస్తుందే తప్ప, సైటు డిజైను చెయ్యదని రిజిస్ట్రారు గారికి వివరిస్తూ, తగు సాంకేతిక సహాయం అందజేస్తామని చెప్పాలని సమావేశం తీర్మానించింది.
2. కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎలా అనే విషయాన్ని ఒక పాఠ్యాంశంగా తయారుచేసి, తెలుగు యూనివర్సిటీ వంటి సంస్థలకు అందజేయాలని సమావేశం తీర్మానించింది. వీవెన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. ఇతర సభ్యులంతా వీవెన్ సూచనలకు అనుగుణంగా తమ వంతు సాయం అందజేస్తారు.
3. పాత్రికేయులకు యూనికోడు గురించి, కంప్యూటర్లో తెలుగు గురించి ఒక సెమినారు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. పాత్రికేయులకు ఈ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం అందజేస్తే, జనబాహుళ్యానికి చేరడం ఎంతో సులువౌతుందని సభ్యులు అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమానికి కృపాల్ కశ్యప్ నేతృత్వం వహిస్తారు. ఈ సెమినారుకు సి మృణాళిని, చేకూరి రామారావు, సి.ధర్మారావు, ఇన్నయ్య వంటి ప్రముఖులను కూడా ఆహ్వానించాలని సభ్యులు సూచించారు. ఈ విషయమై వెంటనే చెయ్యవలసిన పనులివి:
1. కశ్యప్ వార్త, టీవీ9 వంటి సంస్థలలో తనకు తెలిసిన పాత్రికేయ మిత్రులతో మాట్లాడతారు
2. శిరీష్ కుమార్ ఈనాడు వారితో మాట్లాడతారు
3. త్రివిక్రమ్, నల్లమోతు శ్రీధర్, తాడేపల్లి లలితా బలసుబ్రహ్మణ్యం, వలబోజు జ్యోతి వంటి ప్రముఖుల ద్వారా పాత్రికేయులను సంప్రదిస్తారు.
4. సి.బి.రావు ఇన్నయ్య గారిని, చేకూరి రామారావు గారిని సంప్రదిస్తారు.
పై చర్చలతో సమావేశాన్ని ముగించి, సభ్యులు సెలవు తీసుకున్నారు.
ఇటీవలి వ్యాఖ్యలు
3 రోజులు 1 గంట క్రితం
1 వారం 3 రోజులు క్రితం
1 వారం 3 రోజులు క్రితం
1 వారం 5 రోజులు క్రితం
1 వారం 6 రోజులు క్రితం
1 వారం 6 రోజులు క్రితం
2 వారాలు 1 రోజు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 3 రోజులు క్రితం