సదురు బ్లాగు మిత్రులారా..
అందరూ క్షేమమేనని తలుస్తాను. ఏం చేస్తున్నారు? (ఏం చేస్తూంటాం, బ్లాగు చేస్తుంటాం.. అంటారా.. అయితే సమించేయ్యండి )
ఈ నెల రెండవ ఆది వారం యధావిధిగా అందరం మన అడ్డాలో (రెగ్యులర్ చోటులో) కలుద్దామా? మర్పులేమైనా ఉన్నాయా?
తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసప్ గూడ బస్తీ, పైదరాబాద్.
ఏవ్వరికైనా ఏటువంటి ప్రశ్నలూ, అనుమానాలూ ఉన్న యడల నాకు గానీ, వీవెన్‍ను గానీ సంప్రదించగలరు.
సంప్రందించాల్సిన వంబర్లు:
98664 95967 - వీవెన్
9441418139 - అస్మదీయుడు
ఇంతకీ ఏమి చర్చిద్దాం అంటారా. ముందుగా ఇక్కడ చర్చిద్దాం. ఈ నెల సమావేశంలో ఏమి చర్చిస్తే బాగుంటుందో ఇక్కడ చర్చిద్దాం. కాబట్టి మీ మనసులో ఏదైనా ఆలోచన ఉన్నట్లైతే, తెలియజేయగలరు.
భవదీయుడు,
చక్రవర్తి
http://bhavadeeyudu.blogspot.com
చిన్న సవరణ చక్రవర్తిగారూ
ఇది బ్లాగర్ల సమావేశం కాదు. e-తెలుగు సమావేశం. బ్లాగడం e-తెలుగు ఆశయాలలో ఒకటి మాత్రమే.
దుర్వాసుల పద్మనాభం
దుర్వాసుల వారు,
తెలియక తడబడితిమి. ఇక ముందు జాగరూకతతో మెలిగెదము. తెలియజేసినందులకు ధన్యవాదములు.
మీరు తప్పక వస్తారని భావిస్తాను.
ఇట్లు
http://భవదీయుడు.blogspot.com (http://bhavadeeyudu.blogspot.com)
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
నేను పై ప్రకటనలో శీర్షిక మరియు సమయం మార్చాను.
-వీ