రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఈ రోజు కాస్త శాంతించి సమావేశానికి వీలు కల్పించింది. పార్కులో సమావేశానికి సౌకర్యంగా ఉండదని తలిచి ఈ సారి సమావేశం తమ ఇంటిలో జరపడానికి రావుగారు ముందుగానే ప్రతిపాదించారు. అనుకున్నట్టుగానే, వారింట్లో సమావేశమయ్యాం. ఈ సారి ప్రత్యేక అతిథి పర్ణశాల కత్తి మహేశ్ కుమార్. అలానే మలినేని క్రాంతి కుమార్ మరియు శ్రీ మహాలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు మరియు టంగుటూరి ప్రసాద్ హైదరాబాద్ సమావేశానికి మొదటి సారి విచ్చేసారు.
మొదటిగా పరిచయాలతో ప్రారంభించాం.పరిచయాలలో కొత్తవాళ్ళకి అంతర్జాలంలో తెలుగు (ప్రత్యేకించి తెలుగు బ్లాగులు) ఎలా పరిచయం అయ్యింది అన్నది ఓ అంశం. ఇదీ వారి స్పందన:
లక్ష్మి మరియు వెంకటేశ్వర్లు: వీరికి ప్రయాణాలు ఇష్టం. తమ ప్రయాణాల్లో ఎదురైన ఇబ్బందుల వల్ల, ఇలాంటి తెలిపే సైట్లు ఉంటే బావుండనుకున్నారు. తమ అనుభవాలతో ఆంగ్లంలో రాయడం మొదలు పెట్టారు. తెలుగులో కూడా రాయవచ్చని తెలుసుకుని గూగుల్ ఇండిక్ వాడారు. తర్వాత ఎందుకనో వారి కంప్యూరర్లో తెలుగు సరిగా రాకపోతే జాలయ్య సలహాతో, తెలుగు చేతనం చేసుకుని ఇన్‌స్క్రిప్ట్‌లో తెలుగు టైపుచెయ్యడం నేర్చుకున్నారు. దూర్వాసుల పద్మనాభం గారి మెయిలు ద్వారా వీరికి తెలుగు బ్లాగు గుంపు గురించి తెలిసింది.
మహేశ్ కుమార్: తెలుగు సినిమాల దిగుమతి సైటులో నవతరంగం లింకుని చూసారు. అలా నవతరంగంలో వ్యాఖ్యలు రాయడం, తెలుగులో టైపుచెయ్యడం మొదలు పెట్టారు. అక్కడి నుండి సౌమ్య బ్లాగు, తద్వారా కూడలిని చూసారు.
క్రాంతి కుమార్: బ్లాగులు తెలిసినా, ఈనాడులో బ్లాగుల పై వ్యాసం (తెలుగు బ్లాగుల గురించిన వ్యాసం కాదు) ద్వారా తనకో బ్లాగు సృష్టించుకున్నారు. ఏదో పదం గురించి గూగుల్ లో వెతికితే ఓ తెలుగు బ్లాగు తగిలింది. ఆ బ్లాగులోని లింకు ద్వారా కూడలిని చూసారు.
సమావేశానికి హాజరైనవారు:

తర్వాత కొనసాగిన చర్చలో మన పాత ప్రశ్న తెలుగు బ్లాగులనీ అంతర్జాలంలో తెలుగునీ మరింత మందికి తెలియజేయడం ఎలా అని పద్మనాభం గారు లేవనెత్తారు. దీనికి మహేశ్ కుమార్ తన ఆలోచనలు తెలియజేసారు.
వెంకటేశ్వర్లుగారు మాట్లాడుతూ, అంతర్జాలంలో తెలుగు గురించి చిన్న పత్రాన్ని మన స్నేహితులకి పంపి, తెలుగంటే ఆసక్తి ఉన్న వారి మితృలందరికీ ఫార్వార్డు చేయమని చెప్పవచ్చన్నారు. పంపే పత్రాన్ని PDFలో పంపితే ఎటువంటి కంప్యూటర్ పైనైనా చూడవచ్చని అనుకున్నాం. మనం రాసే టపాలని మన స్నేహితులకి పంపిస్తే, వారు కూడా మనం ఎలా రాస్తున్నామో తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తారని క్రాంతి కుమార్ అన్నారు. మనం పంపే తెలుగు సందేశాలు అందరికీ సరిగా వెళ్ళడానికి, జీమెయిల్లోని అమరికలలో యూనికోడ్‌ని ఎంచుకోవాలని కందర్ప కృష్ణమోహన్ తెలియజేసారు.
ఈటీవీ2లో మన కార్యక్రమం గురించి తాజా సమాచారం మా వద్ద లేక, ఎప్పుడొస్తుందో తెలియదన్నాం. e-తెలుగు సంఘం గురించి, మనం చేస్తున్న స్థానికీకరణ వంటి పనుల గురించి నేను వివరించాను.
మళ్ళీ వర్షం మొదలై కాస్త తెరిపినివ్వడంతో అందరం సెలవు తీసుకుని బయలుదేరాం.
వ్యాఖ్యలు
ఓహో,
ఓహో, కొత్తవాళ్ళను కలుసుకునే అవకాశం పోయిందన్నమాట!
పీ.డి.ఎఫ్‌ల
పీ.డి.ఎఫ్‌లో తెలుగు పరిచయ పత్రం పంపడం అన్న ఆలోచన బాగుంది.
కనీసం ముగ్గురు కొత్త వారు కలిసారు కదా, పది మంది పాత వారికి!
కందర్ప
కందర్ప కృష్ణమోహన్
నివేదికకు చప్పట్లు.......