హైదరాబాద్ e-తెలుగు సమావేశం ఏప్రిల్ 2008

ఈసారి సమావేశం చాలా నీరసముగా ప్రారంభమైనది! సుమారుగా 4:30 గంటలకు ప్రారంభమైనది. ఎప్పటిలాగే అందరూ సభ్యులు నూతన సభ్యులతో సమావేశస్థలికి చేరుకున్నారు, ఇంకా కొంతమంది సభ్యుల కొరకు కొంతసేపటి వరకు వేచిచూడాలని సభ్యుల అభిప్రాయంమేరకు వేచిచూడటం జరిగింది.

సి.బి.రావు గారు సభను ప్రారంభిస్తూ, నేను ఈసమావేశానికి వస్తానని అనుకొలేదని కాని కొన్ని ముఖ్యమైన విషయములు చర్చించటానికి వచ్చానని తెలుపుతూ "తెలుగుబ్లాగ్ పుస్తకం" పై చర్చని ప్రారంభించారు. బ్లాగ్ పుస్తకం కవర్ పేజి భాగుందని ప్రసంశిస్తూ, పుస్తకంలో అందరు బ్లాగర్లకు సమప్రాధాన్యం లభించలేదని వచ్చినవారివే 2-3 టపాలు వచ్చాయని, మంచిగా ఉన్న టపాలను చేర్చి ఉంటే బాగుండేదని అని అభిప్రాయం తెలియజేశారు. దాని సభ్యులు ప్రతిస్పందిస్తూ టపాలపై e-తెలుగు వికిలో చర్చ జరిగిందని తెలియజేశారు. కవర్ పేజిపై ఉన్న బ్లాగులు కొన్నింటికి లోపల చోటు దక్కలేదని రావుగారు అన్నారు, అందరూ వారి టపాలు పంపలేదని చావా మరియు వీవెన్ అన్నారు. మరి అలాంటప్పుడు పంపనివారివి ఎలా వేశారని రావు గారు అన్నారు, బ్లాగ్ పుస్తకం పూర్తిగా న్యాయం చేయలేదని విమర్శించారు. తన నిరసనని శ్రీనివాసరాజు గారి పక్కనుంచి చావా గారి పక్కకు స్థానచలనం చేసి తెలియజేశారు!

శ్రీనివాస రాజు, కిరణ్ కుమార్ చావా, సిబి రావ్

అదే సమయానికి సమావేశానికి కందర్ప గారు కుటుంబ సమేతముగా విచ్చేశారు, వచ్చేటప్పుడు స్వీటు, హాటు తెచ్చారు. వారి పాప వాటిని అందరికి పంచుతూ వారిని పేర్లు అడిగి తెలుసుకుంది!

నూతన సభ్యులు చక్రవర్తి (శ్రీకమల్ చక్రవర్తి) గారు తన బ్లాగు అనుభవాలను వివరిస్తూ.. తను 4 సం|రాలు గా బ్లాగులు చూస్తున్నానని, ఇక ఇలా లాభం లేదని ప్రారంభించినట్టు తెలియజేశారు. బ్లాగులు రాసేవారు తగ్గిపొయారని, రాస్తున్నవారు కొందరు ఆపివేశారని వారిని రాసేలాగ చేయాలని అభిప్రాయములు తెలియజేయాలని కొరారు. దానికి చక్రవర్తి గారు ఈ-మెయిల్ లో సంతకం కింద వారి బ్లాగు పేరు ఉంచడం వలన చదివేవారికి తెలియజేయ వచ్చునని తెలిపారు, తెలుగుబ్లాగర్లు ఇదివరకు ఉపయౌగించిన "పుస్తక పురుగు కుట్టింది" దానిని చర్చించారు. అసలు తెలుగుబ్లాగర్ల సమావేశం అవసరమా అని చావా గారు సభికులను ప్రశ్నించారు దానికి వారే ప్రతిస్పందిస్తు ‘సమావేశం సమావేశం కొరకు ఉండాలి’ అని ఇది వరికు చదువరి గారు అన్నారని కాని వారే సమావేశానికి రావటం లేదని అన్నారు.

ఇంతలో కిరణ్ (ఐతే ok) వారి స్నేహితులు చైతన్య (రాగం బ్లాగు) వచ్చారు. కందర్ప గారు బ్లాగు పుస్తకం గురించి మాట్లాడుతూ... సమయాభావం వల్ల పుస్తకం మొత్తం చదవలేకపొయానని కాని పుస్తకం చూడగానే 262పేజీలు ఉండేసరికి తరువాత చదువుదాంలే అనే భావన కలుగుతుందని తెలిపారు. బిల్ గేట్స్ టపా బాగుందని చెప్పారు.

పద్మనాభం గారు చిన్నగా చర్చని e-తెలుగు సంఘంపై ప్రారంభించారు, బ్లాగింగ్ పై ఇంకా ప్రచారం జరగాలని ఈ-తెలుగు ఒక సంఘంగా ఏర్పడాలని అప్పుడే కొత్తకార్యక్రమాలు చేయగలమని, దానికి సభికులంతా ఏకీభవించారు. రావ్ గారు మాట్లాడుతూ ఆపని జరుగుగుతున్నదని ఒక సంవత్సరం క్రితమే ప్రారంభిచామని దాని ఏర్పాటుకు
తనుపడ్డశ్రమ వివరించారు దానిపని భాధ్యత చదువరి గారికి అప్పగించడమైనదని వివరించారు తొరలొ పూర్తికాగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏవైనా ఈ-తెలుగు కు సంబంధిచిన పనులు పని ఒత్తిడిలొ ఉండి చేయలేకపొతే మేము చేయగలమని సభికులు కొందరు కొరారు. ఈ-తెలుగు పరిపాలన, కూడలి, లేఖిని లపై చర్చ జరిగింది, ఈ-తెలుగు కు మార్గదర్శకాలు రూపొందించాలని ఇదివరకు ఉన్న వాటిపై చర్చజరగాలని దానికి ముందు అందరూ ఒకటిగా ఏర్పడాలని అన్నారు.

నల్లమోతు శ్రీధర్, వీవెన్, కట్టా విజయ్, కందర్ప కృష్ణ మోహన్ .

ఈ-తెలుగు సంఘంగా ఏర్పడటం గురించి చర్చించి ఆపని పూర్తి అయితేనే మనం ఏదైనా కొత్తగా చేయొచ్చుఅని అన్నారు. ప్రచారానికి గాను కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలని ఉత్సాహం ఉన్నవారు తెలియజేయాలని అన్నారు. తెలుగు బ్లాగర్ల గుంపులో activity బాగా తగ్గిపోయిందని గుంపులొ చర్చలు ఆగిపొయాయని సభికులన్నారు. తరువాత చర్చని రియల్ ఎస్టేట్ గురించి చర్చించుకున్నారు కొందరు, ‘రిలయన్స్ పూర్తిగా అన్ రిలయబుల్’ అని అన్నారు.

ఇంతలొ కందర్ప గారి పాప సభ్యులలో కొంతమందికి రామాయణంలో పాత్రలకు పేర్లు పెట్టి నవ్వించింది... కొన్ని: రావు గారు (ఆంజనేయ); చావా కిరణ్ (రావణ); స్వాతి (సీత); కందర్ప (రాముడు); వీవెన్ (విసన కర్ర) సభలో కాసేపు నవ్వులాట. సభ ముగించి అందరము తేనీరు కొరకు నడిచాము.

తీర్మానం:
‘ఈ-తెలుగు’ organisation గా ఏర్పడాలి.
‘ఈ-తెలుగు’ మార్గదర్శకాలపై పునఃచర్చ జరగాలి.
ప్రచారానికి గాను కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి.

వచనం: విజయ్ కట్టా
ఫొటోలు :కిరణ్ సౌజన్యంతొ.

సమావేశ ప్రదేశం: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ.
సమావేశ సమయం: సాయంత్రం 4:30 నుంచి 6:30.

వ్యాఖ్యలు

నన్ను దెయ్యం అంది (ఇంతకీ రామాయణంలో ఈ పాత్ర ఎక్కడిదో)
బ్లాగు పుస్తకంలో అన్ని పేజీలు రంగుల్లో ఉండాలన్న నా సూచన ఏం చేసారు?

ఇంకొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి http://www.flickr.com/photos/onlykiron/sets/72157604532285945/

----------------------------------------
- కిరణ్
ఐతే OK [aithesare.blogspot.com]

కందర్ప కృష్ణమోహన్

కూర్పు చాలా బావుంది విజయ్ -
మా అమ్మాయి ఇంతమందికి ఇన్నిన్ని పేర్లు పెట్టిందని నాకు తెలీనే తెలీదు - ఉత్త గడుగ్గాయిలెండి లైట్ తీస్కోండేం.....
తీర్మానాలు కార్యరూపం దాల్చాలని మనసారా కోరుకుంటూ.........

అంతా బాగానే ఉందిగానీ .. అస్సలు రాముడిని మర్చిపోయారు. రాముడు లేని రామాయణంలోని అన్ని పాత్రలగురించి వ్రాసారు.. వాఁ ... వాఁ ... (ఈ ఏడుపల్లా నన్నే రాముడిని చేసిందని చెప్పకుండా చెప్పడానికి..)

e-తెలుగు సమావేశాలన్నింటిలోకి ఇదే నా మొదటిది. అందరిని చూస్తూంటేనే కాలం కరిగిపోయింది, ఇంతలో ఎదో నాకు తెలియని చాలా విషయాల గురించి చర్చించే సరికి, మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. అన్న రీతిలో మిన్నుకుండిపోయాను.

కందర్ప కృష్ణకుమార్ గారి కూతురు చాలా చెలాకీ పిల్ల. ముందు ముందు వారు తమతో పాటుగా ఈ గడుగ్గయిని తప్పకుండా తీసుకువస్తారని ఆశిస్తున్నాను.

ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశం నుంచి చాలా నేర్చుకున్నాననేది అక్షరాలా నిజం. ఇక మీదట తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నిస్తాను.

ముగింపుగా.. చావాకిరణ్ గారు, వీవెన్ గారు మరియు కిరణ్ గార్లకు సభాముఖంగా ఒక విన్నపం. మీరంతా తప్పకుండా బ్లాగింగు చేస్తుంటారు.. కాదనను.. కానీ మీ లాంటి వారికి ఎక్కువ మంది హితులు, సన్నిహితులు, స్నేహితులు, ఇతరితరులు పెక్కు సంఖ్యలో ఉండచ్చు అన్న ఒకే ఒక్క ఆలోచనతో, "మీకు తెలియని (నా) ఐదు విషయాలు" ని ప్రతిపాదించాను. అన్యదా స్పందిస్తారని మనవి
భవదీయుడు,
చక్రవర్తి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి