strict warning: Only variables should be passed by reference in /home/etelugu/etelugu.org/modules/book/book.module on line 560.

మొబైళ్ళలో తెలుగు

ఇటీవల చేతిఫోన్ల వాడకం బాగా పెరిగింది. గతంలో కొన్ని ఫోన్లు తెలుగు కీప్యాడుతో కూడా వచ్చేవి. స్మార్టుఫోన్లు రావడం మొదలైనప్పుడు వాటిల్లో తెలుగుకి తోడ్పాటు ఉండేది కాదు. కానీ ఈ మధ్య స్మార్టుఫోన్లు కూడా తెలుగుకి తోడ్పాటుతో వస్తున్నాయి (ఫోను మొత్తం తెలుగులో లేకపోయినా, తెలుగుని చూడవచ్చూ, టైపుచేయవచ్చూ). తెలుగు తోడ్పాటు ఉన్న ఫోన్లూ, తెలుగు టైపు చేయడానికి అందుబాటులో ఉన్న పద్ధతుల సంగ్రహమే ఈ పేజీ.

తెలుగు చూడడం

ప్రస్తుతం లభించే అన్ని రకాల స్మార్టు ఫోన్లూ తెలుగు తోడ్పాటుతో వస్తున్నాయి. ఏయే ఫోన్లు ఏ సంచిక నుండి తెలుగును సరిగా చూపిస్తాయో అన్న వివరాలు:

  • ఆండ్రాయిడ్: ఆండ్రాయిడ్ ఫోన్లలో 4.2 (జెల్లీ బీన్) ఆపై సంచికలలో (అంటే దాదాపు 2013 నుండి లభించే ఫోన్లు అనుకోవచ్చు) తెలుగుకి తోడ్పాటు ఉంది.
  • ఐఫోన్, ఐప్యాడ్: ఆపిల్ ఐఫోను, ఐప్యాడ్ లలో ఐఓఎస్ 4 ఆపై సంచికలు.
  • విండోస్ ఫోన్: సరికొత్త నోకియా ల్యూమియా వంటి విండోస్ 8 లేదా ఆపై సంచికను కలిగి ఉన్న ఫోన్లు.

మీ చేతిఫోను పైన చెప్పిన సరికొత్త సంచికలను కలిగివున్నప్పటికీ, తెలుగును చూపించడం లేదంటే, ఆ ఫోను తయారీదారు బహుభాషా తోడ్పాటుని అశక్తం చేసివుండటం ఒక కారణం కావచ్చు. ఏమైనప్పటికీ, మీ ఫోను తయారుచేసిన కంపెనీని సంప్రదించడం ఉత్తమం.

జాల సదుపాయమున్న ఫోన్లు (తెలుగు చూడడం మాత్రమే)

మీ చేతిఫోను పైన చెప్పిన వాటిల్లో లేకపోతే, నిరుత్సాహపడాల్సిన పనిలేదు. మీ ఫోనులో జాలానికి అనుసంధానమయ్యే సామర్థ్యం ఉంటే, తెలుగు జాల గూళ్ళను చూడవచ్చు. ఇలా:

  1. మీ ఫోనులోని జాల విహారిణిలో m.opera.com సైటుకి వెళ్ళండి.
  2. అక్కడ నుండి ఓపెరా మినీ (Opera Mini) అనే విహారిణిని దించుకోండి. (ఓపెరా మొబైల్ కాదు, ఒపెరా మినీ!)
  3. అది స్థాపించుకున్న తర్వాత తెరిచి ఈ చిరునామా పట్టీలో opera:config అని టైపు చేసి ఎంటర్/గో నొక్కండి.
  4. తర్వాత వచ్చే పేజీలో అడుగున Use bitmap fonts for complex scripts అన్న ఎంపికను Yesగా ఎంచుకోండి.
  5. తర్వాత, Save బొత్తాన్ని నొక్కి, ఓపెరా మినీని పునఃప్రారంభించండి.

మొబైళ్ళలో తెలుగు టైపు చెయ్యడం

మీ ఫోను కీప్యాడ్ మీద తెలుగు అక్షరాలు లేకపోతే, ఈ క్రింది ఆప్స్‌ను ఉపయోగించి మీ చేతిఫోన్లలో తెలుగు టైపు చెయ్యవచ్చు:

ఆండ్రాయిడ్

ఐఫోన్, ఐప్యాడ్

విండోస్ ఫోన్లు

చేతిఫోన్లలో తెలుగు చూడాలనుకునే, వ్రాయాలనుకునే వారందిరికీ ఈ సమాచారం ఉపయోగపడుతూందని ఆశిస్తున్నాం.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer