e-తెలుగు
స్వాగతం!
e-తెలుగు అన్నది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగుని వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ.
ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను) మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగడం. వాడుకోగలగాలి. అదే మా స్వప్నం. ఆ దిశగా మేము కృషిచేస్తున్నాం.
e-తెలుగు లక్ష్యాల గురించి మరింత తెలుసుకోండి.
ఆగస్టు నెల e-తెలుగు హైదరాబాదు సమావేశ విశేషాలు
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఈ రోజు కాస్త శాంతించి సమావేశానికి వీలు కల్పించింది. పార్కులో సమావేశానికి సౌకర్యంగా ఉండదని తలిచి ఈ సారి సమావేశం తమ ఇంటిలో జరపడానికి రావుగారు ముందుగానే ప్రతిపాదించారు. అనుకున్నట్టుగానే, వారింట్లో సమావేశమయ్యాం. ఈ సారి ప్రత్యేక అతిథి పర్ణశాల కత్తి మహేశ్ కుమార్. అలానే మలినేని క్రాంతి కుమార్ మరియు శ్రీ మహాలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు మరియు టంగుటూరి ప్రసాద్ హైదరాబాద్ సమావేశానికి మొదటి సారి విచ్చేసారు.
మొదటిగా పరిచయాలతో ప్రారంభించాం.పరిచయాలలో కొత్తవాళ్ళకి అంతర్జాలంలో తెలుగు (ప్రత్యేకించి తెలుగు బ్లాగులు) ఎలా పరిచయం అయ్యింది అన్నది ఓ అంశం. ఇదీ వారి స్పందన:
దుర్వాసుల పద్మనాభం, వెంకటేశ్వర్లు, మరియు లక్ష్మి
మహేశ్ కుమార్: తెలుగు సినిమాల దిగుమతి సైటులో నవతరంగం లింకుని చూసారు. అలా నవతరంగంలో వ్యాఖ్యలు రాయడం, తెలుగులో టైపుచెయ్యడం మొదలు పెట్టారు. అక్కడి నుండి సౌమ్య బ్లాగు, తద్వారా కూడలిని చూసారు.
క్రాంతి కుమార్: బ్లాగులు  తెలిసినా, ఈనాడులో బ్లాగుల పై వ్యాసం (తెలుగు బ్లాగుల గురించిన వ్యాసం కాదు) ద్వారా తనకో బ్లాగు సృష్టించుకున్నారు. ఏదో పదం గురించి గూగుల్ లో వెతికితే ఓ తెలుగు బ్లాగు తగిలింది. ఆ బ్లాగులోని లింకు ద్వారా కూడలిని చూసారు.
సమావేశానికి హాజరైనవారు:
దూర్వాసుల పద్మనాభం
దాట్ల శ్రీనివాసరాజు
కందర్ప కృష్ణ మోహన్
టంగుటూరి ప్రసాద్
PSM లక్ష్మి
వెంకటేశ్వర్లు
కత్తి మహేశ్ కుమార్
సీబీరావు
క్రాంతి కుమార్
వీవెన్
ఎడమ నుండి: దూర్వాసుల పద్మనాభం, వెంకటేశ్వర్లు, లక్ష్మి, శ్రీనివాసరాజు, వీవెన్, మహేశ్ కుమార్, కృష్ణమోహన్, సీబీరావు, మరియు క్రాంతి కుమార్
తర్వాత కొనసాగిన చర్చలో మన పాత ప్రశ్న తెలుగు బ్లాగులనీ అంతర్జాలంలో తెలుగునీ మరింత మందికి తెలియజేయడం ఎలా అని పద్మనాభం గారు లేవనెత్తారు. దీనికి మహేశ్ కుమార్ తన ఆలోచనలు తెలియజేసారు.
ప్రత్యేకిత స్థానిక సమాచార ఆవశ్యకత చాలా ఉంది. వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే బ్లాగులు మరిన్ని రావాలి. అలాగే, చాలా సేవా సంస్థలు వద్ద సహాయిక సమాచారం చాలా వుంది. వారు దీన్ని స్థానిక భాషలలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. వీరికి ఔత్సాహికుల సహాయం అవసరం. తెలుగు బ్లాగరులు వారికి తోడ్పడవచ్చు.
మన స్నేహితులకి మన బ్లాగుల గురించి మెయిల్ పంపించవచ్చు.
దాట్ల శ్రీనివాసరాజు, వీవెన్, కత్తి మహేశ్ కుమార్, మరియు కందర్ప కృష్ణమోహన్
ఈటీవీ2లో మన కార్యక్రమం గురించి తాజా సమాచారం మా వద్ద లేక, ఎప్పుడొస్తుందో తెలియదన్నాం. e-తెలుగు సంఘం గురించి, మనం చేస్తున్న స్థానికీకరణ వంటి పనుల గురించి నేను వివరించాను.
మళ్ళీ వర్షం మొదలై కాస్త తెరిపినివ్వడంతో అందరం సెలవు తీసుకుని బయలుదేరాం.
e-తెలుగు, కంప్యూటర్ ఎరా సంయుక్త సమావేశం జూలై 2008 నివేదిక
సమయం: 13, జూలై, 2008, మధ్యాహ్నం 3 గంటలు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్.
హాజరైన సభ్యులు
1. కృష్ణకుమార్
2. శ్రవణ్ కుమార్
3. సిహెచ్. రామ్ కుమార్
4. నల్లమోతు శ్రీధర్
5. జి. శ్రీనివాస్
6. ఎన్. విక్రమ్
7. కె.జె. సత్యసాయిరాం
8. జి. ఛాయాదేవి
9. బి. ప్రసన్న కుమారి
10. పి. కశ్యప్
11. సి. భాస్కరరావు
12. దూర్వాసుల పద్మనాభం
13. తుమ్మల శిరీష్ కుమార్
14. గబ్బిట సుబ్రహ్మణ్య విఠల్
15. సి. ఫణిరామ దీక్షితులు
16. వీవెన్
17. కొత్తపల్లి సీతారాం
18. నువ్వుశెట్టి కృష్ణకిషోర్
19. కట్టా విజయ్
20. శ్రీధర్ పతి
ఎడమ నుండి కుడికి వరుసగా: సిబిరావు, కశ్యప్, ప్రసన్నకుమారి, ఛాయాదేవి, సత్యసాయిరాం, విక్రమ్, శ్రీనివాస్
సభ్యుల పరిచయాలు పూర్తయిన తర్వాత కొత్త పల్లి సీతారాం గారు తెలుగు భాష నానాటికీ ఎంతగా ఉనికిని కోల్పోతోందో కొన్ని అంశాలను ఉటంకిస్తూ భాష గాలి లాంటిదని దానికి ఆయువు లాంటి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ద్వారా భాషని స్థిరంగా నిలబెట్టుకోగలమని విశ్లేషిస్తూ.. తను స్వయంగా పరిశోధించి కనుగొన్న సరికొత్త ఏనిమేషన్ టెక్నాలజీ సహకారంతో వేమన పద్యాలు, దసరా పద్యాలు వంటి సాంస్కృతిక సంపదకు దృశ్యరూపం కల్పించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు భాషని కాపాడడంలో ప్రభుత్వం, ఇతర భాషా పరిరక్షణా ఉద్యమాల పాత్ర కొంతసేపు చర్చనీయాంశం అయింది. అలాగే ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధనకు ప్రభుత్వం పూర్తిస్థాయి సుముఖత వ్యక్తం చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు వగైరా ప్రస్తావించబడ్డాయి. చదువరి గారు, సిబి రావు గారు. కశ్యప్ గారు పద్మనాభం గారు తదితరులు సమస్య యొక్క పార్శ్యాలను విభిన్న కోణాల్లో చర్చించారు. అలాగే ఈ సమావేశానికి దూర్వాసుల పద్మనాభం గారు విఠల్ గారి కుటుంబ సభ్యులను, కొత్తపల్లి సీతారాం గారిని ఆహ్వానించడం ద్వారా మన ఉద్యమాన్ని మరికొందరు భాషాభిమానులకు పరిచయం చేశారు. సమావేశానికి హాజరైన కంప్యూటర్ ఎరా పాఠకులను తెలుగులో బ్లాగులు ప్రారంభించమని సిబి రావు గారు, పద్మనాభం గారు కోరారు.  చదువరి గారు e-తెలుగు  "సంస్థ" హోదా చేరక మునుపు ఏ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించబడ్డాయో అదే స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలియజేశారు. e-తెలుగు చేపడుతున్న స్థానికీకరణ వంటి పనులకు మరింత మంది ఔత్సాహికులు స్వచ్చంధంగా తమ సహకారం అందిస్తే పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.
ఎడమ నుండి కుడికి వరుసగా: విక్రమ్, శ్రీనివాస్, నల్లమోతు శ్రీధర్, రామ్ కుమార్, శ్రవణ్ కుమార్
విభిన్న శైలిల్లో యూనీకోడ్ ఫాంట్ల రూపకల్పన విషయమై వీవెన్ ప్రస్తావిస్తూ.. సి-డాక్ వారు విడుదల చేసిన ఫాంట్లలో ఆకృతుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచెయ్యడానికి ఫాంట్ మాపింగ్ పై అవగాహన ఉన్న నిపుణుల సహకారం అవసరం అని తెలిపారు. వివిధ సాఫ్ట్ వేర్ ఉపకరణాల స్థానికీకరణ విషయం ప్రస్తావిస్తూ.. వర్డ్ ప్రెస్ తెలుగీకరణ 66% పూర్తయిందని, వికీపీడియా సాఫ్ట్ వేర్, ఉబుంటు స్థానికీకరణ పనులు జరుగుతున్నట్లు వీవెన్ వెల్లడించారు. ఇలా పలు విషయాలు చర్చిస్తుండగా జాన్ హైడ్ కనుమూరి గారు రావడం ఆయన ఇటీవల విడుదల చేసిన "అమ్మ సంకలనం" గురించి అందరూ అభినందించడం జరిగింది. ఈ నేపధ్యంలో త్వరలో తాను "గ్రంధాలయాల సంకలనం" పేరిట మరో సరికొత్త ప్రాజెక్ట్ ని విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎడమ నుండి కుడికి వరుసగా: రామదీక్షితులు, విఠల్, తుమ్మల శిరీష్ కుమార్, దూర్వాసుల పద్మనాభం, కొత్తపల్లి సీతారాం, సిబిరావు
తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి "కంప్యూటర్ ఎరా" చేపట్టిన సాంకేతిక సహాయం ఛాట్ రూమ్, ఫోరంల విషయమై.. సభ్యుల భాగస్వామ్యం మరింత పెంపొందించాలంటే ఓపెన్ గా ఉన్న సందేహాలు లాగిన్ పేజీలో ఆటోమేటిక్ గా వచ్చేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కశ్యప్ గారు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి కెరీర్ దృష్ట్యా వస్తున్న యువతకు కెరీర్ గైడెన్స్ ఇచ్చేలా చిన్న చిన్న సెమినార్లు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు చదువరి గారు ప్రత్యక్షంగానే కాకుండా ఫోరంలో కూడా తగిన సమాచారం అందిస్తే బాగుంటుంది అని సూచించారు. కంప్యూటర్ ఎరా ఛాట్, ఫోరంలకు బొత్తాం తయారు చేస్తే వీలైన వారందరూ తమ బ్లాగుల్లో పెడతారని కట్టా విజయ్ గారు సూచించారు.
చివరిగా యధావిధిగా క్యాంటీన్ కి వెళ్లి తేనీరు సేవించి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టాం.
- నల్లమోతు శ్రీధర్
హైదరాబాద్ e-తెలుగు సమావేశవివరములు జూన్ నెల 2008
జూన్ నెల సమావేశం అధ్యక్షులు తుమ్మల శిరీష్ కుమార్ గారి అధ్యక్ష్యతన జరిగింది. మొత్తం తొమ్మిది మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో యూనికొడ్ గురించి పాత్రికేయులకు ఒక సమావేశాన్ని నిర్వహించాలని, ఎక్కడ ఎలా చేయాలని  ప్రణాళిక గురించి చర్చించారు. "ఇంకా మనం బ్లాగులకు ఏమైనా చేయాలా!" అన్న చావా కిరణ్ గారి ప్రశ్నకు పద్మనాభం గారు ఇంకా వ్యాప్తి చెందాలని, తెలుగు భాషా పండితులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు!
వీవెన్ గారు వివిధ తెలుగు అనువాదాలగురించి వివరించారు, వర్డ్ ప్రెస్స్ అనువాదాలలో పాలుపంచుకోవాలంటే ఇక్కడ  చూడమన్నారు. తుమ్మల శిరీష్ కుమార్ గారు సభికులకు అనువాదములలో పాలుపంచుకోవాలని అందరి అభిప్ర్రాయములు తెలుసుకున్నారు!
సమావేశానికి వచ్చినవారందరికి ఉబుంటు వారి లినక్స్ సిడిలను పంపిణి చేయటం జరిగింది, కొంతమంది లినక్స్ ఉపయోగములు తదితర వివరములు వీవెన్, చావా కిరణ్, వెంకటరమణలను  అడిగితెలుసుకున్నారు.
కార్యవర్గ సభ్యులు e-తెలుగు కార్యక్రమ విధులగురించి, సంఘం గురించి చర్చించారు.
వరుణుడు భయపెడుతుండటంతో  ఆరు గంటలకు సభ ముగించాం.
హాజరైన సభ్యులు:
1.ఉషా రాణి
2.వీవెన్
3.చావా కిరణ్
4.వెంకటరమణ
5.సి. భాస్కరరావు
6.కట్టా విజయ్
7.దుర్వాసుల పధ్మనాభం
8.దాట్ల శ్రీనివాసరాజు
9.తుమ్మల శిరీష్ కుమార్
మే 18 బెంగుళూరు సమావేశం వివరములు
మే 18 బెంగుళూరులో రెండు దఫాలుగా సమావేశం జరిగింది.
పొద్దున్న మురళిగారి ఇంట్లో .. (చించుబుడ్డితో పాటు..)
రాత్రి శంకర్ రెడ్డి గారితో  మారతహళ్ళిలో...
పట్టుదలతో సమావేశం జరిపాం.
మురళిగారి అనుభవాలు ... దోసలు తింటూ...
బెంగుళూరులో Janaagraha.org గురించి..
తెలుగు Unicode గురించి...
చిచ్చు బుడ్ది పరిచయం.. మురళి గారి బుడతడు..
అమెరికా లో ఎలా సమావేశం జరుగుతుంది గురించి...
బెంగుళూరులో  చాలా సమావేశాలు (technical)జరుగుతుంటాయి. వాటి గురించి  శ్రీధర్ అనగా నేను ఈ బ్లాగులో రాస్తుంటా...(http://ambatisreedhar.wordpress.com/)
శంకర్ రెడ్డి కవితలు గురించి ...
బెంగుళూరులో  ఎలా తెలుగువారిని కలవడం...
చిన్న చిన్న ఆలోచనలు..
అప్పుడు చిరు ప్రయత్నం గురించి ... http://etelugu.org/node/112
e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం - 2008 మే 18
e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం, 2008 మే 18 న హైదరాబాదు, వెంగళరావు నగర్ లోని సి.బి.రావు గారి ఇంటిలో జరిగింది.
సమావేశం సాయంత్రం 4:45 కు మొదలైంది.
సమావేశ ఆవశ్యకతను వివరిస్తూ సంఘ అధ్యక్షుడు తుమ్మల శిరీష్ కుమార్ ఇలా అన్నారు: సంఘం రిజిస్ట్రేషను జరిగిన తరువాత, కార్యవర్గ కూర్పును సమీక్షించి అవసరమైన మార్పుచేర్పులు చెయ్యాలనే ఉద్దేశ్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేసాం.
హాజరైన సభ్యులు
1. వీవెన్
2. దూర్వాసుల పద్మనాభం
3. పలివెల కృపాల్ కశ్యప్
4. చావా కిరణ్ కుమార్
5. దాట్ల శ్రీనివాసరాజు
6. సి. భాస్కరరావు
7. ఉప్పల వెంకటరమణ
8. తుమ్మల శిరీష్ కుమార్
సమావేశం కింది విషయాలను పరిశీలించి తీర్మానాలు చేసింది:
1. సంఘ కార్యకలాపాల నిర్వహణకుగాను కార్యదర్శికి సహాయకంగా ఒక సంయుక్త కార్యదర్శిని అన్నుకోవాలని తీర్మానించడమైనది. దాట్ల శ్రీనివాసరాజును ఈ పదవికి ఎన్నుకోవాలని ప్రతిపాదన వచ్చింది.ప్రతిపాదించినవారు: సి.భాస్కరరావు. సమర్ధకులు: కృపాల్ కశ్యప్. తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
2. కార్యవర్గాన్ని బలోపేతం చేస్తూ మరొక సభ్యుని తీసుకోవాలని తీర్మానించడమైనది. దూర్వాసుల పద్మనాభం గారిని ఈ స్థానంలోకి తీసుకోవాలని తుమ్మల శిరీష్ కుమార్ ప్రతిపాదించగా, వీవెన్ దాన్ని సమర్ధించారు. తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
3. సంఘ సమావేశాల నిర్వహణ, కార్యవర్గ సభ్యుల మధ్య సమాచార నిర్వహణ మొదలైనవాటిని వెబ్‌లో నిర్వహించాలని  ప్రతిపాదన వచ్చింది. సభ్యులంతా ప్రత్యక్షంగా ఒకచోట సమావేశమై చర్చించే కంటే వెబ్‌లో నిర్వహించడం వలన సభ్యుల సమయం ఆదా కావడమే కాక, విలువైన ధనం కూడా ఆదా అవుతుందని భావించడం వలన ఈ విషయాన్ని సమావేశం ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం-
అ) ఛాట్ కూడళ్ళలో సభ్యులంతా సమావేశమై కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక వారం రోజులు ముందుగానే సభ్యులందరికీ ఇమెయిలు ద్వారా తెలియపరుస్తారు.
ఆ) సమావేశ స్థలం లోకి ఇతరులు రాకుండా ప్రవేశాన్ని సంకేతపదంతో నియంత్రిస్తారు.
ఇ) సమావేశ వివరాలను  (మినిట్స్ ఆఫ్ మీటింగ్) సంఘ అధికారిక వెబ్‌సైటు అయిన etelugu.org లో ప్రచురిస్తారు. సభ్యులు అ వివరాలను చదివి తమ ఎలక్ట్రానిక్ సంతకాలను చేస్తారు
ఈ) సంఘం ఒక బ్యాంకు ఖాతా తెరవాలని సమావేశం తీర్మానించింది.
ఉ) అంతర్జాలంలోని సంఘపు ఆస్తుల నిర్వహణ పట్ల సమావేశం ఇలా తీర్మానించింది: డొమెయిను పేరును ప్రతీ ఏటా రిజిస్ట్రారు వద్ద తిరగ రాయడం, సంఘ వెబ్‌సైటును నిర్వహించడం వంటి బాధ్యతలను వీవెన్‌పై ఉంచింది. ప్రస్తుతం ఈ ఖర్చు సంవత్సరానికి రూ.1500/- అవుతున్నది.
ఆ తరువాత సమావేశం కింది విషయాలను చర్చించింది.
1. తెలుగు విశ్వవిద్యాలయం వారి వెబ్‌సైటును తెలుగీకరించడం: విశ్వవిద్యాలయ వెబ్‌సైటును రీడిజైను చెయ్యవలసినదిగా రిజిస్ట్రారు కోరారని కృపాల్ కశ్యప్ చెప్పారు. అయితే సంఘం తెలుగీకరణకు, యూనీకోడీకరణకు అవసరమైన సాంకేతిక సహాయం చేస్తుందే తప్ప, సైటు డిజైను చెయ్యదని రిజిస్ట్రారు గారికి వివరిస్తూ, తగు సాంకేతిక సహాయం అందజేస్తామని చెప్పాలని సమావేశం తీర్మానించింది.
2. కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎలా అనే విషయాన్ని ఒక పాఠ్యాంశంగా తయారుచేసి, తెలుగు యూనివర్సిటీ వంటి సంస్థలకు అందజేయాలని సమావేశం తీర్మానించింది. వీవెన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. ఇతర సభ్యులంతా వీవెన్ సూచనలకు అనుగుణంగా తమ వంతు సాయం అందజేస్తారు.
3. పాత్రికేయులకు యూనికోడు గురించి, కంప్యూటర్లో తెలుగు గురించి ఒక సెమినారు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. పాత్రికేయులకు ఈ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం అందజేస్తే, జనబాహుళ్యానికి చేరడం ఎంతో సులువౌతుందని సభ్యులు అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమానికి కృపాల్ కశ్యప్ నేతృత్వం వహిస్తారు. ఈ సెమినారుకు సి మృణాళిని, చేకూరి రామారావు, సి.ధర్మారావు, ఇన్నయ్య వంటి ప్రముఖులను కూడా ఆహ్వానించాలని సభ్యులు సూచించారు. ఈ విషయమై వెంటనే చెయ్యవలసిన పనులివి:
1. కశ్యప్ వార్త, టీవీ9 వంటి సంస్థలలో తనకు తెలిసిన పాత్రికేయ మిత్రులతో మాట్లాడతారు
2. శిరీష్ కుమార్ ఈనాడు వారితో మాట్లాడతారు
3. త్రివిక్రమ్, నల్లమోతు శ్రీధర్, తాడేపల్లి లలితా బలసుబ్రహ్మణ్యం, వలబోజు జ్యోతి వంటి ప్రముఖుల ద్వారా పాత్రికేయులను సంప్రదిస్తారు.
4. సి.బి.రావు ఇన్నయ్య గారిని, చేకూరి రామారావు గారిని సంప్రదిస్తారు.
పై చర్చలతో సమావేశాన్ని ముగించి, సభ్యులు సెలవు తీసుకున్నారు.
హైదరాబాదు e-తెలుగు సమావేశం - 2008 మే
e-తెలుగు హైదరాబాదు సమావేశం 2008 మే 11 న హైదరాబాదు కృష్ణకాంత్ పార్కులో జరిగింది. సమావేశం సాయంత్రం 4 గంటల్కు అనుకున్నప్పటికీ 4:20కి మొదలైంది. ఫ్రాన్సులో ఉండే వారణాసి కిరణ్, ఈ సమావేశానికి రావడం ఒక విశేషం.
సమావేశానికి వచ్చిన స్సభ్యులు:
యు.వెంకటరమణ
తుమ్మల శిరీష్ కుమార్
విజయ్ కట్టా
కృపాల్ కశ్యప్
సాయిచరణ్
దూర్వాసుల పద్మనాభం
దాట్ల శ్రీనివాసరాజు
బి.కిరణ్
వీవెన్
భానుప్రసాద్
వారణాసి కిరణ్
చక్రవర్తి
సి.బి.రావు
e-తెలుగు ఒక సంఘంగా నమోదైన తరువాత జరిగిన మొదటి సమావేశంలో చర్చ అంతా e-తెలుగు గురించే జరిగింది.
ముందుగా చదువరి సంఘావిర్భావాన్ని గురించి క్లుప్తంగా వివరించారు. సంఘం చేపట్టవలసిన కార్యక్రమాల గురించి సభ్యులు తమ తమ సూచనలను చెప్పవలసిందిగా ఆయన కోరారు.
పద్మనాభం, చక్రవర్తి, బి.కిరణ్ మొదలైన వారు తమ తమ అభిప్రాయాలను చెబుతూ కింది సూచనలను చేసారు.
1. eతెలుగు గురించిన పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. దాని వెబ్‌సైటులో కూడా సరైన వివరాలు లేవు. సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ వెబ్‌సైటును పునర్వ్యవస్థీకరించాలి.
2. సమావేశాలు పార్కుల్లో కాక, ఏదైనా భవనంలో ఒక సీరియస్ వాతావరణంలో జరగాలి.
3. ఇప్పటివరకు వ్యక్తిగత స్థ్యాయిల్లో, అసంఘటితంగా జరుగుతున్న పనులను సంఘటితం చెయ్యడమెలాగో ఆలోచించాలి.
4. సమాజంలోగానీ, ప్రభుత్వంలో గానీ పెద్దలను ఎవరినైనా కలుస్తున్నపుడు e-తెలుగు సంస్థ తరపునే కలవాలి.
5. తెలుగు నెజ్జనులను సంఘంలో చేరమంటూ ప్రోత్సహించాలి.
6. సంఘంలో సభ్యుల నమోదు చేసుకునేందుకు తగు ప్రవేశపత్రాన్ని తయారు చేసి సంఘపు వెబ్‌సైటులో పెట్టాలి. సభ్యత్వ రుసుము వసూలు చెయ్యాలి.
7. e-తెలుగు చేపట్టదలచిన పనుల విషయమై సంఘ కార్యవర్గ సభ్యులే ముందుకు వచ్చి పనులు మొదలుపెట్టి ఇతర సభ్యులకు స్ఫూర్తినివ్వాలి.
8. సంఘపు చిహ్నం, లెటరుహెడ్లు తయారు చెయ్యాలి.
9. e-తెలుగు టీషర్టులు తయారుచెయ్యాలి.
10. బ్లాగుల్లో e-తెలుగు బొత్తాలు తయారుచేసి పెట్టుకోవాలి. తద్వారా సంఘానికి ప్రచారం కల్పించాలి.
అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే విషయంలో ఇప్పటికే అనేక రకాలుగా, వివిధ స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి. ఇక ఈ పనులను e-తెలుగు ద్వారా జరిపేందుకు గాను తగు ప్రణాళికలను తయారు చెయ్యాలని చెబుతూ, చదువరి వాటిపై సభ్యుల అభిప్రాయాలను కోరారు:
1. ఫాంట్లు: కొత్త ఫాంట్ల తయారీని e-తెలుగు ప్రోత్సహించాలనే విషయంపై జరిగిన చర్చలో కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సీ-డాక్ వారు ఫాంట్లు ఇప్పటికే తయారు చేసి ఉన్నారు. కానీ అవి బహుళ ప్రయోజనకరంగా లేవు. వారిని సంప్రదించి తగు ఫాంట్ల తయారీ కోసం కృషిచెయ్యాలి. ముందుగా పెడ్యాల రాంబాబు గారిని సంప్రదించాలి. కశ్యప్, చదువరి ఈ పని చేపడతారు.
వైజాసత్య, చరసాల ప్రసాదు గారలు ఫాంట్ల తయారీ విషయమై ఇప్పటికే చొరవ తీసికొని 10 వేల రూపాయలు, 5 వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు ప్రకటించి ఉన్నారు. దానికి స్పందనగా ఫాంట్లు తయారు చేసేందుకు దర్భా అంబరీష్ గారు ముందుకు వచ్చారు. దాని ప్రగతిని సమీక్షించి ఆ పనిని పూర్తయేలా చర్యలు తీసికోవాలి. వీవెన్ ఈ పనిని చేపడతారు.
సి.బి.రావు గారు ఈ పనిలో నిమగ్నమై ఉన్న తన స్నేహితుని సంప్రదిస్తారు.
2. అనువాదాలు: స్థానికీకరణ, యూనికోడీకరణ అనే రెండు ప్రధానమైన తెలుగీకరణ పనులు ఇప్పటికే వీవెన్ చొరవతో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు, ప్రాజెక్టుల జాబితాతో సహా etelugu.org లో వీవెన్ ఇప్పటికే చేర్చి ఉన్నారు. అయితే ఈ పనిలో చాలా కొద్ది మంది మాత్రమే చురుగ్గా పాల్గొంటున్నారు. సభ్యులంతా ఇతోధికంగా పాల్గొని తెలుగీకరణ పనులను జయప్రదం చెయ్యాలి. ఆయా ప్రాజెక్టుల వివరాలను వీవెన్ తాజాకరించి పర్యవేక్షిస్తారు.
3. నిఘంటువులు, పదకోశాలు: నిఘంటు నిర్మాణమనేది వ్యక్తుల సమూహం చేపడితే చెయ్యవచ్చని వారణాసి కిరణ్ అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాలు ఇవి:
ఒక ఆన్‌లైను నిఘంటువును తయారుచెయ్యాలి. ఆ నిఘంటువులో ఇప్పటికే ఆన్‌లైనులో ఉన్న నిఘంటువులలోని పదాలు, వాటి అర్థాలను చేర్చాలి. ఈ పని ఇప్పటికే విక్షనరీలో జరుగుతూంది.
తరువాత ఒక ప్రామాణిక ఇంగ్లీషు నిఘంటువును తీసికొని దానిలోని పదాలను తీసికొని తెలుగులోకి అనువదించే పని మొదలుపెట్టాలి. ఈ పనిని నేరుగా నిఘంటువులో కాకుండా, దీనికోసం ప్రత్యేకించిన వెబ్‌సైటులో చెయ్యాలి. తెలుగు పదం గుంపులో ఈ పని ఇప్పటికే జరుగుతూంది. సభ్యులు పదాలకు అర్థాలను  ఈ సైటులో సూచిస్తారు.
వచ్చిన అనువాదాలపై సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలియజేసే సౌకర్యం ఏర్పాటు చెయ్యాలి.
ఎక్కువమంది సభ్యులు ఆమోదించిన పదాలను ఒక జాబితాగా తయారుచెయ్యాలి. ఈ పదాలను  అంతర్జాలంలోనూ, ముద్రణా రంగంలోనూ వ్యాప్తి చేసేందుకు కృషి చెయ్యాలి. ఏదైనా ఒక వెబ్ పత్రికలోనూ, ఒక ముద్రిత పత్రికలోనూ ఆ పదాన్ని వాడినపుడు ఆ పదానికి ప్రామాణికత లభించినట్లుగా భావించాలి. అలా ఆమోదం పొందిన పదాలను ఆన్‌లైను నిఘంటువులో చేర్చాలి.
తెలుగు ఉపాధ్యాయులను ఈ పనిలో పాల్గొనేలా సంఘం చొరవతీసుకుని వారిని సంప్రదించాలి. ఉపాధ్యాయుల సంఘాల ద్వారా వీరిని సంప్రదించడం ఒక మార్గం.
పై విషయాలన్నిటినీ క్రోడీకరిస్తూ వారణాసి కిరణ్ ఒక ప్రణాళికను తయారుచేసి e-తెలుగుకు పంపిస్తారు.
సభ్యులు ఆ ప్రణాళికను చర్చించి,  ఒక ఆచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
ఈ చర్చలన్నీ జరిగాక, కొన్ని ఇతర విషయాలు కూడా చర్చించుకున్నాక, సభ్యులు సెలవు తీసికొన్నారు.
సమావేశపు ఫోటోలు అందగానే పెడతాం.
హైదరాబాద్ e-తెలుగు సమావేశం ఏప్రిల్ 2008
ఈసారి సమావేశం చాలా నీరసముగా ప్రారంభమైనది! సుమారుగా 4:30 గంటలకు ప్రారంభమైనది. ఎప్పటిలాగే అందరూ సభ్యులు నూతన సభ్యులతో సమావేశస్థలికి చేరుకున్నారు, ఇంకా కొంతమంది సభ్యుల కొరకు  కొంతసేపటి వరకు వేచిచూడాలని సభ్యుల అభిప్రాయంమేరకు వేచిచూడటం జరిగింది.
సి.బి.రావు గారు సభను ప్రారంభిస్తూ, నేను ఈసమావేశానికి వస్తానని అనుకొలేదని కాని కొన్ని ముఖ్యమైన విషయములు చర్చించటానికి వచ్చానని తెలుపుతూ "తెలుగుబ్లాగ్ పుస్తకం" పై చర్చని ప్రారంభించారు. బ్లాగ్ పుస్తకం కవర్ పేజి భాగుందని ప్రసంశిస్తూ, పుస్తకంలో అందరు బ్లాగర్లకు సమప్రాధాన్యం లభించలేదని వచ్చినవారివే 2-3 టపాలు వచ్చాయని, మంచిగా ఉన్న టపాలను చేర్చి ఉంటే బాగుండేదని అని  అభిప్రాయం తెలియజేశారు. దాని సభ్యులు ప్రతిస్పందిస్తూ టపాలపై e-తెలుగు వికిలో చర్చ జరిగిందని తెలియజేశారు. కవర్ పేజిపై ఉన్న బ్లాగులు కొన్నింటికి లోపల చోటు దక్కలేదని రావుగారు అన్నారు, అందరూ వారి టపాలు పంపలేదని చావా మరియు వీవెన్ అన్నారు. మరి అలాంటప్పుడు  పంపనివారివి ఎలా వేశారని రావు గారు అన్నారు, బ్లాగ్ పుస్తకం పూర్తిగా న్యాయం చేయలేదని విమర్శించారు. తన నిరసనని శ్రీనివాసరాజు గారి పక్కనుంచి చావా గారి పక్కకు స్థానచలనం చేసి తెలియజేశారు!
శ్రీనివాస రాజు, కిరణ్ కుమార్ చావా, సిబి రావ్
అదే సమయానికి సమావేశానికి కందర్ప గారు కుటుంబ సమేతముగా విచ్చేశారు, వచ్చేటప్పుడు స్వీటు, హాటు తెచ్చారు. వారి పాప వాటిని అందరికి పంచుతూ వారిని పేర్లు అడిగి తెలుసుకుంది!
నూతన సభ్యులు చక్రవర్తి (శ్రీకమల్ చక్రవర్తి) గారు తన బ్లాగు అనుభవాలను వివరిస్తూ.. తను 4 సం|రాలు గా బ్లాగులు చూస్తున్నానని, ఇక ఇలా లాభం లేదని ప్రారంభించినట్టు తెలియజేశారు. బ్లాగులు రాసేవారు తగ్గిపొయారని, రాస్తున్నవారు కొందరు ఆపివేశారని వారిని రాసేలాగ చేయాలని అభిప్రాయములు తెలియజేయాలని కొరారు. దానికి చక్రవర్తి గారు ఈ-మెయిల్ లో సంతకం కింద వారి బ్లాగు పేరు ఉంచడం వలన చదివేవారికి తెలియజేయ వచ్చునని తెలిపారు, తెలుగుబ్లాగర్లు ఇదివరకు ఉపయౌగించిన "పుస్తక పురుగు కుట్టింది" దానిని చర్చించారు. అసలు తెలుగుబ్లాగర్ల సమావేశం అవసరమా అని చావా గారు సభికులను ప్రశ్నించారు దానికి వారే ప్రతిస్పందిస్తు ‘సమావేశం సమావేశం కొరకు ఉండాలి’ అని ఇది వరికు చదువరి గారు అన్నారని కాని వారే సమావేశానికి రావటం లేదని అన్నారు.
ఇంతలో కిరణ్ (ఐతే ok) వారి స్నేహితులు చైతన్య (రాగం బ్లాగు) వచ్చారు. కందర్ప గారు బ్లాగు పుస్తకం గురించి మాట్లాడుతూ... సమయాభావం వల్ల పుస్తకం మొత్తం చదవలేకపొయానని కాని  పుస్తకం చూడగానే 262పేజీలు ఉండేసరికి తరువాత చదువుదాంలే అనే భావన కలుగుతుందని తెలిపారు. బిల్ గేట్స్ టపా బాగుందని చెప్పారు.
పద్మనాభం గారు చిన్నగా చర్చని e-తెలుగు సంఘంపై ప్రారంభించారు, బ్లాగింగ్ పై ఇంకా ప్రచారం జరగాలని ఈ-తెలుగు ఒక సంఘంగా ఏర్పడాలని అప్పుడే కొత్తకార్యక్రమాలు చేయగలమని, దానికి సభికులంతా ఏకీభవించారు. రావ్ గారు మాట్లాడుతూ ఆపని జరుగుగుతున్నదని ఒక సంవత్సరం క్రితమే ప్రారంభిచామని దాని ఏర్పాటుకు
తనుపడ్డశ్రమ వివరించారు దానిపని భాధ్యత చదువరి గారికి అప్పగించడమైనదని వివరించారు తొరలొ పూర్తికాగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏవైనా ఈ-తెలుగు కు సంబంధిచిన  పనులు పని ఒత్తిడిలొ ఉండి చేయలేకపొతే మేము చేయగలమని సభికులు కొందరు కొరారు. ఈ-తెలుగు పరిపాలన, కూడలి, లేఖిని లపై చర్చ జరిగింది, ఈ-తెలుగు కు మార్గదర్శకాలు రూపొందించాలని ఇదివరకు ఉన్న వాటిపై చర్చజరగాలని దానికి ముందు అందరూ ఒకటిగా ఏర్పడాలని అన్నారు.
నల్లమోతు శ్రీధర్, వీవెన్, కట్టా విజయ్, కందర్ప కృష్ణ మోహన్ .
ఈ-తెలుగు సంఘంగా ఏర్పడటం గురించి చర్చించి ఆపని పూర్తి అయితేనే మనం ఏదైనా కొత్తగా చేయొచ్చుఅని అన్నారు. ప్రచారానికి గాను కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలని ఉత్సాహం ఉన్నవారు తెలియజేయాలని అన్నారు. తెలుగు బ్లాగర్ల గుంపులో activity బాగా తగ్గిపోయిందని గుంపులొ చర్చలు ఆగిపొయాయని సభికులన్నారు. తరువాత చర్చని రియల్ ఎస్టేట్ గురించి చర్చించుకున్నారు కొందరు, ‘రిలయన్స్  పూర్తిగా అన్ రిలయబుల్’ అని అన్నారు.
ఇంతలొ కందర్ప గారి పాప  సభ్యులలో కొంతమందికి రామాయణంలో పాత్రలకు పేర్లు పెట్టి నవ్వించింది... కొన్ని: రావు గారు (ఆంజనేయ); చావా కిరణ్ (రావణ); స్వాతి (సీత); కందర్ప (రాముడు); వీవెన్ (విసన కర్ర) సభలో కాసేపు నవ్వులాట. సభ ముగించి అందరము తేనీరు కొరకు నడిచాము.
తీర్మానం:
‘ఈ-తెలుగు’ organisation గా ఏర్పడాలి.
‘ఈ-తెలుగు’ మార్గదర్శకాలపై పునఃచర్చ జరగాలి.
ప్రచారానికి గాను కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి.
వచనం: విజయ్ కట్టా
ఫొటోలు :కిరణ్ సౌజన్యంతొ.
సమావేశ ప్రదేశం: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ.
సమావేశ సమయం: సాయంత్రం 4:30 నుంచి 6:30.
బెంగుళురు తెలుగు బ్లాగరుల సమావేశ వివరములు 23 మార్చి 2008
బెంగుళూరు తెలుగు బ్లాగరుల సమావేశం ఆదివారం అనగా 23 మార్చి 2008 లాల్ బాగ్ లో ఉదయం 10:15 గ లకు జరిగింది.
హాజరైన వారు:
మురళీకృష్ణ కూనపరెడ్డి
ప్రవీణ్ గార్లపాటి
ప్రదీప్ మాకినేని
అంబటి శ్రీధర్
అంబటి ఉష
కొత్తగా చేరినవారు:
అంబటి శ్రీధర్
అంబటి ఉష
చర్చించినవి:
1. వికితో ఎలా పని చేయాలి?
2. వికిలో ఎలా ఫోటోలను అప్ లోడ్ చేయాలి?
౩. కబుర్లు, కూడలి ఎలా వాడాలి?
4. యాగ్రిగేటర్లు అనగానేమి?
5. ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్స్ "umbutu linux, python language" గురించి
6. యూనీకోడ్ , rts, inscript అనగానేమి?
7. డాట్ నెట్ లో ఆంగ్లం నుండి తెలుగులో మాట్లాడే సాప్ట్ వేర్ తయారు చేస్తే బాగుంటుదని
కూడలిలో సమావేశాల గురించి "notification area :" బేనరు ఉంటే ఎక్కువ మంది
చూస్తారని చర్చించాము.
తరువాత కొన్ని చక్కని ఫోటోలను తీసుకొని 12:45 p.m. కి వీడ్కోలు
పలికితిమి.
ఫొటోలో ఉన్నవారు  : మురళీకృష్ణ కూనపరెడ్డి,ప్రదీప్ మాకినేని,అంబటి శ్రీధర్,అంబటి ఉష
ఫొటోలో ఉన్నవారు  : మురళీకృష్ణ కూనపరెడ్డి,ప్రవీణ్ గార్లపాటి,ప్రదీప్ మాకినేని,అంబటి శ్రీధర్
మీ
శ్రీధర్ అంబటి.
http://tellaboutyourself.blogspot.com
మార్చి నెల 2008 హైదరాబాదు eతెలుగు సమావేశ నివేదిక
ఈసారి భానుడి ప్రతాపం వల్ల సమావేశం కొద్దిగా ఆలస్యముగానే ప్రారంభమైనది(మూడు గంటల 30 నిముషాలకు),ఈ సారితక్కువమంది సబ్యులు హాజరు అవుతారనుకుంటుండగా.. నాలుగు గంటలకు చిన్నగా ప్రారంభమై ఆరు గంటలవరకు వస్తూనేఉన్నారు!
సమయం: 3 గం 30 నిమిషములు
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
హాజరైన సభ్యులు: 20
నూతన సభ్యులు: 4
ప్రవీణ్,శ్రావ్య,సత్యసాయి,శ్రీనివాసరాజు,త్రివిక్రం.
మొదటగా నూతన సభ్యుల పరిచయకార్యక్రమాలు మొదలయ్యాయి, నరసింహారావు గారు(పద్మనాభం గారి మిత్రులు), నందగిరి ప్రవీణ్ గారు(భాగ్యనగరం బ్లాగు), కె.యస్. శ్రావ్య గారు (సత్యసాయి గారి కుమార్తె). అప్పుడు సత్యసాయి గారు  శ్రావ్యవరాళి(కె.యస్.శ్రావ్య)ని సభకు పరిచయం చేస్తు 7వ తరగతి పూర్తి చేసింది అనిచెప్పగా.. శ్రావ్య కలిపించుకొని 7వ తరగతి కాదు 8 మిది అనగానే సభలొ నవ్వులతొనిండి పొయింది. ఇంతలొ రావు గారు (సి.బి.రావ్) గారు పేరు పైన వివరణ అడిగితెలుసుకున్నారు, సీతారామ శాస్త్రి గారు(కే.బి.యల్ శర్మ గారి స్నేహితులు) నూతన బ్లాగరి! కొత్త వాళ్ళ పరిచయకార్యక్రమాలు ముగియగానే....
కట్టా విజయ్,తుమ్మల శిరీష్,సి.బి.రావ్,క్రిస్ట్నకిషొర్.
[సమయం 4 గం|30నిమిషములు..]
చదువరి గారి రాక(తుమ్మల శిరీష్),చావా కిరణ్ గారు (ఒరెమూన) తెలుగు బ్లాగర్లపై అలిగారని! అందుకే ఆలశ్యముగా వస్తున్నారని తెలియగనే సభలొ నవ్వులతొనిండిపొయింది, రావు గారికి సుధాకర్ (శొధన) గారికి మధ్య ఉత్తమ తెలుగు బ్లాగుల విషయమై చాలా రసవత్తరమైన చర్చజరిగింది! రావు గారు నేను ఎందుకు లెజండ్ కాదు అని ప్రశ్నించగానే ఎవరి బ్లాగుకి  వారే "సుమన్" అని అనడంతొ విషయం చర్చ 'ఎవరిబ్లాగుకి  వారే  సు మన్ ' మీదకి  వెళ్ళింది!
[సమయం 4 గంటల 45 నిముషాలు.. ]
జాన్ హైడ్ కనుమూరి గారి రాక. శర్మ గారు వారి పుత్రికను సభకు పరిచయం చేశారు పేరు 'సుమబాల'.
రావు గారు త్రివిక్రం గారిని ఉద్దేశించి 'వివాహాయ:బ్లాగునాశాయ: ' అని తరచూ బ్లాగు రయకపొవడంపై చిన్న చురక అంటించారు.
వెంకటరమణ,శర్మ(సుమబాల తొ),శాస్త్రి.
[సమయం 5 గంటలు....]
చావా కిరణ్ గారి రాక.
బ్లాగులు వాటి విలువలు, ఎలారాయలి, బ్లాగు లక్షణాలపై సుధాకర్ గారి సుదీర్గమైన వివరణ...లో బ్లాగుకి వెబ్ సైటుకి తేడా, ఏమి రాయలి, ఎప్పుడు రాయాలి అనేదాని పైన చర్చ జరిగింది. రావు గారు సుధాకర్ గారినుంచి వీలైనంతవిషయాన్ని చెప్పించటానికి ప్రయత్నించారు. 'తెలుగులొ అత్యుత్తమ బ్లాగులు' సుధాకర్ గారు టపాపై వివరణ ఇచ్చారు. ఇంతలొ వసంతకుమార్ గారి హాట్ మరియూ సత్యసాయి గారి స్వీట్స్ సభలొ చక్కెర్లు కొట్టాయి.
సభికులందరు ఎజండా పై చర్చని కొరగా.. వీవెన్ గారు బీటావికీ గురించి వివరణ ఇచ్చారు http://translatewiki.net/wiki/Main_Page ఇక్కడ అనువాదాలు చేయాలని దీనివలన ఇతర భాషల వికీలను కూడా తెలుగులో  చదవవచ్చునని తెలిపారు, వివిధ అనువాదాలు ఎంతవరకు అయినది సభకు వివరించారు.
సత్యసాయి,శ్రీనివాసరాజు,త్రివిక్రం,సుధాకర్,వీవెన్.
[సమయం 6 గంటలు]
చివరిగా 20వ వ్యక్తిగా కాశ్యప్ గారి రాక! కొత్తబ్లాగర్లని పెంచడం ఏలా అని చర్చ! సత్యసాయి గారు localisation project (NIC) గురించి సభకు వివరించారు.
[సమయం 6 గం 10 నిమిషములు]
సత్యసాయి గారు సభకువీడ్కొలు పలికారు... అంతాలేచి నిలబడి గుంపులుగాచేరి చర్చించుకుంటున్నారు. జాన్ గారు కొత్తవారికి  వారి రచనల పుస్తకాన్ని ఇచ్చారు.  అందరం మాట్లాడుకుంటూ Cafetaria కి చేరుకొని టీ, కాఫి సేవించి బయలు దేరటానికి  ఉపక్రమించాం.. అప్పుడు బడ్జెట్ పైన, రాజకీయాలపైన  చర్చ జరిగింది (కొద్ది సేపే!!).
[సభికులు]
1. కశ్యప్
2. చావా కిరణ్
3. వసంతకుమార్
4. జాన్ హైడ్ కనుమూరి
5. తుమ్మల శిరీష్
6. సీతారామ శాస్త్రి
7. కే.బి.యల్ శర్మ
8. కే.యస్.శ్రావ్య
9. సత్యసాయి
10. శ్రీనివాసరాజు ధాట్ల
11. సుధాకర్
12. వెంకటరమణ
13. వీవెన్
14. త్రివిక్రం
15. సి.బి.రావు
16. పద్మనాభం దుర్వాసుల
17. నరసింహారావు
18. నువ్వుశెట్టి క్రిష్టకిషొర్
19. నందగిరి ప్రవీణ్
20. కట్టా విజయ్
వచనం:కట్టా విజయ్
ఫిబ్రవరి 2008 హైదరాబాదు eతెలుగు సమావేశ నివేదిక
ఈసారి సమావేశానికి ప్రత్యేక ఆకర్షణలు  తెవికీలో  చురుగ్గా పాల్గొంటున్న సుధాకరబాబు (కాసుబాబు), వికీసోర్సులో అన్వేషి అనబడు శేషగిరి, బాల్‌పెన్నుతో అత్యంత అద్భుతంగా చిత్రాలు గీసిన బుసాని పృథ్వీరాజు వర్మ, స్వాతి వాళ్ళబ్బాయి కాబోయే బ్లాగరి చిన్నారి ప్రహసిత్.
కొత్త సభ్యుల పరిచయాలు: ఎల్. ఉషారాణి, బుసాని పృథ్వీరాజు వర్మ (మెడికల్ ట్రాన్స్క్రిప్టర్), సత్యనారాయణ శాస్త్రి (డి టి పి డిజైనర్), శరత్ రెడ్డి (9వ తరగతి విద్యార్థి), సాయి చరణ్ (10వ తరగతి విద్యార్థి), 03-02-2008 నాటి ఈనాడు పత్రిక వ్యాసానికి ప్రభావితులై నేరుగా సమావేశానికి వచ్చిన కొత్త సభ్యులుగా పరిచయమయ్యారు.
ఎడమ నుండి వరుసగా: స్వాతి, శరత్ రెడ్డి, విజయ్ కట్టా, సాయి చరణ్, సత్యనారాయణ శాస్త్రి, ఉషారాణి
తరువాత 03-02-2008 నాటి ఈనాడు పత్రిక వ్యాసం గురించిన చర్చ జరిగింది. వ్యాసం చాలా చక్కగానూ, ఎంతో ప్రభావితం చేసేది గానూ ఉందని సభ్యులందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. మునుపటి కంటే ఈ సారి ఎక్కువమంది కొత్తవారు తెవికీ రాసే ప్రయత్నం చేసారు. శహభాష్ అని భుజం తట్టుకోడమే కాక మరింత క్రియాశీల కార్యకర్తలమై పనిచేయవలసిన ఆవశ్యకతను అందరూ గుర్తించారు.
ఎడమ నుండి వరుసగా: ఉషారాణి, పృథ్వీరాజ్, శ్రీనివాస, త్రివిక్రమ్, నల్లమోతు శ్రీధర్
చావా కిరణ్ తెవికీలో మన ఊరు పేజీ మొలకల గురించి అందులోని సాధక బాధకాల గురించి వివరించారు. అన్ని ఊళ్లలోనూ ఉండేవి కాకుండా ఆ గ్రామానికే ప్రత్యేకమైన అంశాలు రాస్తే బాగుంటుంది. అలాగే పేజీలను బొమ్మల కొలువుగా మార్చనవసరం లేదనీ అనుకున్నాం. తెవికీలో ఉంచదగ్గవిగా అనిపించిన విషయాలను (సమాచారం/బొమ్మలు) మాత్రమే ఎగుమతి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వివిధ సాఫ్ట్‌వేర్ల అనువాద స్థితి గురించిన చర్చలో శోధన సుధాకర్ మాట్లాడుతూ, మనం సమావేశమైనపుడే ఎవరైనా ఒకరిద్దరు అంకోపరి(లాప్‌టాప్)లను తెచ్చి అక్కడికక్కడే ఔత్సాహిక సభ్యులచేత అనువాద ప్రక్రియ మొదలుపెట్టిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. సభ్యులందరూ ఈ ప్రతిపాదనకు తమ అంగీకారాన్ని తెలుపుతూ ఈ ప్రక్రియను ‘అనువాద యజ్ఞం’ పేరుతో నడిపిస్తామని ముందుకు వచ్చారు.
ఎడమ నుండి వరుసగా: వీవెన్, చావా కిరణ్, సుధాకర్, శేషగిరి, కాసుబాబు
తెవికీ మిత్రులు కాజా సుధాకరబాబు గారు మాట్లాడుతూ, ఉన్న బ్లాగులన్నిటిలో వాసికెక్కిన టపాలను గుర్తించి వాటిని తెవికీలోకి (వికీలో చేర్చదగిన అంశాలను మాత్రమే) ఎగుమతి చేయడానికి సదరు బ్లాగు యజమానులు అనుమతిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు గాను తెలుగుబ్లాగు గుంపుకి ఒక వేగు పంపమని స్వాతికుమారి గారు సూచించారు.
తరువాత ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు పుస్తకం ప్రతిపాదన గురించిన చర్చ జరిగింది. సభ్యులందరినీ ఈ విషయమై చురుగ్గా పాల్గొనవలసినదిగా కోరడం జరిగింది.
ఎడమ నుండి వరుసగా: సీబీరావు (తెల్ల టీషర్టు), శరత్, సాయిచరణ్, విజయ్ కట్టా, సత్యనారాయణ శాస్త్రి
సభ్యులు  తెచ్చిన కుకీస్ మరియు స్వీటు-హాటు  అందరం పంచుకొని, క్యాంటీన్‌లో తేనీరు సేవించి , మధ్యలో సభ్యులందరూ  ఉపసమూహాలుగా ఏర్పడి ఎన్నో సాంకేతిక పరమైన విషయాలు, వాటిలోని సాధక బాధకాలు చర్చించుకొని ఎన్నో సందేహాలను తీర్చుకొని అందరూ వీడ్కోలు తీసుకొన్నారు.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు...........
కార్యక్రమణిక:
సభ్యుల పరిచయ కార్యక్రమం
03-02-2008 నాటి ఈనాడు పత్రిక వ్యాసం యొక్క పర్యవసానముల గురించిన చర్చ
అంతర్జాలం (internet) లో తెలుగు సులభంగా వాడడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉపకరణాల పరిచయం
అంతర్జాలం లో తెలుగు వ్యాప్తి చెందడానికి కావలసిన సాంకేతిక సహాయ సహకారముల గూర్చి చర్చ
కొన్ని కంప్యూటర్ అప్లికేషన్సు మరియు సాఫ్ట్‌వేర్‌ల స్థానికీకరణ గురించి చర్చ
సభ్యులందరికీ తెలుగులో బ్లాగు మొదలుపెట్టవలసిన ఆవశ్యకత గురించి వివరణ
హాజరైన సభ్యులు:
సీబీ రావు
వీవెన్
చావా కిరణ్
త్రివిక్రమ్
వెంకటరమణ
సుధాకర్ (శోధన)
నల్లమోతు శ్రీధర్
దాట్ల శ్రీనివాసరాజు
దూర్వాసుల పద్మనాభం
కందర్ప కృష్ణమోహన్
కట్టా విజయ్
శేషగిరి (అన్వేషి)
సుధాకరబాబు
స్వాతికుమారి
ఎల్. ఉషారాణి
బుసాని పృథ్వీరాజు వర్మ
సత్యనారాయణ శాస్త్రి
శరత్ రెడ్డి
సాయి చరణ్
వచనం: కందర్ప, శ్రీనివాస
తెలుగులో టైపు చెయ్యడం ఎలా?
ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.  వాటన్నింటి సమాహారమే ఈ టపా.
వెబ్ పనిముట్లు: (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు.)
లేఖిని
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ
క్విల్‌పాడ్
స్వేచ్ఛ
కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి:
ఇన్‌స్క్రిప్ట్, అందుకు ట్యూటర్.
బరహా
అక్షరమాల
మాడ్యులర్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే మాడ్యూలర్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
ఆపిల్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే ఆపిల్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
లినక్స్ లో
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
మీకు ఫైర్‌ఫాక్స్ విహారిణిలో తెలుగు సరిగా కనిపించక పోతే ఈ సూచనలు పాఠించండి. అప్పటికీ తెలుగు సరిగా రాకపోతే, ఇక్కడ చేప్పిన మొదటి మూడు సోపానాలు పాఠించండి.
Indic Input Extension
పద్మ పొడగింత
తెలుగు టూల్బార్
మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానం ఏది?
* [Phonetic] RTS, ITRANS (లేఖిని, బరహా, అక్షరమాల, పద్మ)\n* [Assisted Phonetic] RTS, ITRANS (గూగుల్ ఇండిక్, క్విల్‌పాడ్)\n* [Non-phonetic] ఇన్‌స్క్రిప్ట్\n* [Non-phonetic] మాడ్యులర్\n* [Non-phonetic] ఆపిల్\n* ఇతరాలు\n* \n* \n* \n* \n
2008 జనవరి నెల eతెలుగు సమావేశ వివరాలు
ఈ-తెలుగు సమావేశము
తేదీః 06-01-2008; వేదికః కృష్ణకాంత్ పార్క్, యూసుఫ్‌గూడా, హైదరాబాద్
ఈసారి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. పత్రికా విలేకరులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాం. నల్లమోతు శ్రీధర్, కశ్యప్ అన్ని పత్రికలకు వెళ్ళి ప్రెస్‌నోటును ఇచ్చి, సమావేశానికి ఆహ్వానించారు. ఈనాడు, హిందూ పత్రికల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి సమావేశానికి వచ్చారు.
కార్య క్రమణిక
సభ్యుల పరిచయ కార్యక్రమం
అంతర్జాలంలో తెలుగు సులభంగా వాడడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉపకరణాలు, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చెందడానికి కావలసిన సాంకేతిక సహాయ సహకారములను గూర్చి విలేకరులకు వివరించడం.
కొన్ని కంప్యూటర్ అప్లికేషన్సు మరియు సాఫ్ట్వేర్ల స్థానికీకరణ గురించి చర్చ.
కొత్త సభ్యులకు తెలుగులో బ్లాగు మొదలుపెట్టే విధానం గురించి వివరణ.
హాజరైన సభ్యులుః
పచ్చిక మీద కూచ్చున్నవారు, కింది నుండి: దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు), ప్రసాద్ (గణపతి సహచరుడు), వెంకటేష్ (భూమిక), గణపతి (రైతే రాజు)
గట్టు మీద కూచ్చున్నవారు, కింది నుండి: కట్టా విజయ్ (జాబిలి), తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి), వెంకట రమణ (వెంకటరమణ బ్లాగు), సి.బి.రావు (దీప్తిధార), చావా కిరణ్ (ఒరెమూనా), దూర్వాసుల పద్మనాభం (తెలుగు గ్రీటింగ్స్), వీవెన్ (వీవెనుడి టెక్కునిక్కులు)
వెనుక నిలబడ్డవారు: నల్లమోతు శ్రీధర్ (శ్రీధర్ సాంకేతికాలు), కందర్ప కృష్ణమోహన్ (తెలుగుతీపి), రవికిరణ్ (పూలవాన), మోహనరెడ్డి (కొత్త సభ్యులు, ఇంకా బ్లాగు లేదు), కృష్ణ కిషోర్ (నువ్వుశెట్టి బ్రదర్స్)
కశ్యప్ (కబుర్లు చెప్పాలని ఉంది) కూడా వచ్చారు గానీ, ఆలస్యంగా రావడం చేత ఈ ఫోటోలో లేరు
ప్రత్యేక ఆహ్వానితులుః
కెబిఎల్ శర్మ - ఈనాడు
ఘంటసాల వసంతకుమార్ – ఈనాడు
సాయిగోపాల్ – ది హిందూ
వెంకటేష్ - భూమిక పత్రిక నుండి వచ్చారు.
సమావేశ వివరాలుః
ముఖ్యాంశాలు
సమావేశం సాయంత్రం మూడున్నరకు మొదలైంది. రైతేరాజు బ్లాగును మొదలుపెట్టిన బిఎల్ఎస్ గణపతి గారు ఈ సమావేశానికి అనుకోకుండా వచ్చి సంభ్రమం కలిగించిన అతిథి. ఆయన్ను చూడగానే మిగతా బ్లాగరులందరూ చప్పట్లతో ఆనందం ప్రకటించి ఆహ్వానించారు. పది నెలల కిందటనే కంప్యూటరుతో పనిచెయ్యడం నేర్చుకుని, బ్లాగుల గురించి తెలుసుకుని ఆయన బ్లాగును మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరికి చెందిన ఆయన అక్కడే కాక, మహారాష్ట్రలో కూడా మెట్ట వ్యవసాయం చేస్తూ ఉంటారు. "నాకు ఇంగ్లీషు రాదు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం కావాలంటే రైతు కొత్త విషయాలు నేర్చుకోవాలి. అందుకు గాను వాళ్ళు కొత్త టెక్నాలజీని వాడుకోవాలి. బ్లాగును నేను అందుకు వాడతాను" అని ఆయన చెప్పినపుడు సభ్యులంతా తమ హర్షాన్ని తెలుపుతూ చప్పట్లు చరిచారు. "సమావేశానికి అందరూ వస్తారు, కలిసి నా సందేహాలను తీర్చుకోవచ్చని వచ్చాను" అని ఆయన చెప్పారు. eతెలుగు ఉద్యమ విజయాల్లో "రైతేరాజు" ఘనమైనదిగా సభ్యులు భావించారు.
నెజ్జనుల వలయం
ఈ-తెలుగుసంఘం ఆశయాల గురించి వీవెన్ విలేకరి మిత్రులకు వివరించారు. వీవెన్, వెంకటరమణ, చావా కిరణ్ విలేకరుల ప్రశ్నలకు కింది విధంగా సమాధానాలు ఇచ్చారు.
"బ్లాగరులంతా తమతమ వృత్తుల్లో నిమగ్నమై ఉంటారు. బ్లాగులకు తమ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నార"నే ప్రశ్నకు, తమ తీరిక           వేళల్లోనే చేస్తూ ఉంటామని సభ్యులు చెప్పారు.
చాలా వెబ్ సైట్లు మామూలుగా ఇంగ్లీషులో ఉంటాయి. వాటిని తెలుగులో మార్చడం ఈతెలుగు సభ్యులే చేస్తూ ఉంటారు.
సాఫ్ట్వేర్ల స్థానికీకరణ గూర్చి వీవెన్ వివరించారు. వర్డ్ ప్రెస్ 72% పూర్తి కావచ్చిందని చెబుతూ దాదాపు 1000 స్ట్రింగ్స్ ఇంకా           అనువదించవలసినవి ఉన్నాయన్నారు. గూగుల్ అప్లికేషన్స్ మరింత బాగా అనువదించడానికి ఆ పని చేయడానికి ఇష్టమున్నవారు కావాలని           అభిప్రాయపడ్డారు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ 5.3% మరియు 7zip అనే కంప్రెషన్ సాఫ్ట్వేర్ 50% పైగా అనువదించబడిందని చెప్పారు.
లినక్సు మొదలైన వాటి మీద అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ సమన్వయపరచే పని కూడా  ఈతెలుగు చేస్తుంది.
అసలిలా సంఘంలా ఏర్పడాలని ఎందుకనిపించింది అన్న ప్రశ్నకు: మేము గత కొన్నేళ్ళుగా వికీపీడియా, బ్లాగు మొదలైన వివిధ స్థలాల్లో            పనిచేస్తూ ఉన్నాం. ఆయా పనులన్నిటినీ సమన్వయపరచే ఉద్దేశ్యంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసాం అని వీవెన్ చెప్పారు.
చైనా, జపాను, కొరియా వంటి కొన్ని దేశాల్లో సాఫ్టువేర్లన్నీ తమతమ భాషల్లోనే ఉంటాయి. ఆయా దేశాల్లోని కంపెనీలు తమ ఆర్థిక పరిస్థితి           నివేదికలన్నిటినీ తమతమ భాషల్లోనే తయారు చేస్తూ ఉంటారు. ఆయాదేశాల్లో విడుదల చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను కూడా వారి భాషల్లోనే           విడుదల చేస్తారు.
వికీపీడియా వ్యాసాల సంఖ్యను పరిశీలిస్తే, ఇంగ్లీషేతర భాషల వికీల్లో ఇంగ్లీషు కంటే చాలా ఎక్కువ వ్యాసాలున్నాయి. దాన్నిబట్టి, ఇతర భాషల           ప్రాముఖ్యత తెలుస్తోంది.
అంతేకాక, ఇంగ్లీషు తెలిసిన వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్ల ఇంటరుఫేసులోని కొన్ని పదాలు తెలియకపోవచ్చు.
"కంప్యూటరు ఎరా" తరపున కూడలిలో ఒక కబుర్ల స్థలాన్ని తెరిచాం. దీనిద్వారా సభ్యులకు సాంకేతిక సహాయాన్ని వెనువెంటనే           అందిస్తున్నాం. శ్రీధర్, జ్యోతి, వీవెన్ మొదలైన వారు ఈ పనిలో పాల్గొంటూ ఉన్నారు.
యూనికోడ్ గురించిన వివరణలతో కూడిన చర్చ జరిగింది.
ఈనాడు పత్రిక నుండి వచ్చిన ఛాయాగ్రాహకుడు ఘంటసాల వసంతకుమార్ గారు సమావేశం చివర్లో సభ్యుల ఫోటోలు తీసుకున్నారు. ఆ తరువాత అందరం క్యాంటీన్‌కి వెళ్ళి కాఫీలు తాగి ఒకరికొకరు భారంగా వీడ్కోలు చెప్పుకున్నాము.
ఎడమ నుండి: మోహనరెడ్డి, కట్టా విజయ్, నల్లమోతు శ్రీధర్, గణపతి
అనల్పాంశాలు
"భూమిక" పత్రిక నిర్వాహకులు తమ పత్రికను, తాము ముద్రించిన స్త్రీ సంబంధ విశేషాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని పంపించారు. పత్రికను 10   రూపాయలకు, పుస్తకాన్ని 50 రూపాయలకు సభ్యులకు అమ్మారు.
సమావేశం జరిగిన పార్కు లోకి తిండి పదార్దాలను అనుమతించకపోవడం చేత చదువరి వాటిని బయటే ఉంచేసి రాగా, కందర్ప కృష్ణమోహను     చాకచక్యంగా లోపలికి తేగలిగారు. సమావేశంలో ఒకసారి, ముగించి బయటికి వెళ్ళాక మరోసారి సభ్యులు పసందైన ఆ తీపి పదార్ధాలను సేవించారు.
"ఒరెమూనా అంటే ఏంటి" అనే సందేహం మరోసారి తలెత్తింది.
హిందూ విలేకరి సాయి గోపాల్ గారికి ఇంగ్లీషులో బ్లాగు ఉంది.
మీ పత్రికలో ఏమేం చేస్తుంటారు, చేస్తున్నారు అంటూ సభ్యులు పాత్రికేయులను ఎదురు ఇంటర్వ్యూలు చేసారు.
సభ్యులు సమావేశ వివరాలను ఆడియో ఫైళ్ళుగా తమ తమ కెమెరాలు, ఎమ్‌పీ3 ప్లేయర్లలో రికార్డు చేసారు.
సమావేశం జరిగిన మరుసటి రోజే హిందూ పత్రికలో వార్త వచ్చేసింది. అయితే అందులో అనేక తప్పులు దొర్లాయి. ఈ విషయమై నెజ్జనులు తమ నిరసనను తెలిపారు
ఎడమ నుండి: కె.బి.ఎల్.శర్మ (ఈనాడు), సి.బి.రావు, కృష్ణ కిషోర్, రవికిరణ్
గమనికలు
ఫిబ్రవరి రెండో ఆదివారం నాడు జరుప తలపెట్టిన సమావేశానికి ప్రవాసాంధ్రులొకరిద్దరు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సభ్యులు రికార్డు చేసిన ఆడియో ఫైలును అప్‌లోడు చేసి లింకు ఇస్తాము.
ఎంత వివరంగా ఈ నివేదికను రాసినా..,
సమావేశానికి వచ్చి, అక్కడి వాతావరణంలో సభ్యుల ముచ్చట్ల మధ్య, చెతుర్లూ చెణుకుల మధ్య, కాజాలూ, బర్ఫీలూ నంజుకుంటూ, నెట్లో తెలుగు వెలుగుల గురించి చర్చించుకోవడంలో ఉండే ఆనందంలో శతాంశం కూడా ఈ నివేదికను చదివి పొందజాలరు. ఇక్కడ చెప్పిన కబుర్ల కంటే చెప్పని విషయాలు ఎన్నో రెట్లున్నాయి. సమావేశానికి రాలేకపోయిన సభ్యులపై సానుభూతితోనూ, వచ్చే సమావేశనికి హై. లో ఉండే సభ్యులంతా రావాలని కోరుతూనూ ఈ నివేదికను ముగిస్తున్నాం.
ఫోటోలు: సి.బి.రావు
నివేదిక: కందర్ప కృష్ణమోహన్, తుమ్మల శిరీష్ కుమార్