ప్రచారం, అవగాహన, మరియు సాంకేతిక సహాయం

ఇప్పటికీ చాలా మందికి కంప్యూటర్లలో తెలుగు టైపుచెయ్యవచ్చని తెలియదు. (ఇది మొదటి ఆటంకం.) పలు రకాల తెలుగు గూళ్ళు ఉన్నాయనీ, జాలాన్ని తెలుగులో వెతకవచ్చనీ తెలియదు. తెలుగుని కంప్యూటర్లలో చూడడం మరియు రాయండంలో చిన్న చిన్న ఆరంభ సమస్యలు ఉన్నాయి. కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగు గురించి ప్రచారం చేయడం, అవగాహనా సదస్సులు నిర్వహించడం, మరియు సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా పై ఆటంకాలని అధిగమించాలన్ని ఈ కార్యకలాకపు లక్ష్యం.

ఏం చేస్తాం:

  • కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగు గురించి ప్రాధమిక అవగాహన కలిగించాలి.
    • కంప్యూటర్లో పెద్ద మార్పులు లేకుండానే, తెలుగు చదవవచ్చూ రాయవచ్చు
    • ఈమెయిళ్ళని తెలుగులో పంపుకోవచ్చు
    • తెలుగులో గూళ్ళు ఉన్నాయి, బ్లాగులున్నాయి, వికీపీడియా ఉంది.
    • జాలాన్ని తెలుగులో వెతకవచ్చు.
  • తెలుగుకి సంబంధించి న సాంకేతిక సమస్యలకు మనకి చేతనైన సహాయం అందించడం.
    • చూడడం (ప్రశ్నార్ధకాలు: యూనికోడ్ తోడ్పాలు లేదు; డబ్బాలు: యూనికోడ్ తోడ్పాటు ఉంది, ఖతి లేదు; వత్తులు విడిపోవడం: పూర్తిస్థాయి యూనికోడ్ తోడ్పాటు లేదు లేదా ఖతి సమస్య.)
    • వ్రాయడం (కంప్యూటర్లో అన్ని చోట్లా తెలుగు రాయడం ఎలా)
  • మన కార్యకలాపాలని ప్రజలకి తెలియజేయడం. మరియు మరింత మంది మనతో కలిసేలా ప్రోత్సహించడం

ఎలా:

  • వర్కుషాపులు/అవగాహనా సదస్సులని మరియు ప్రచారోద్యమాలని నిర్వహించడం
    • పుస్తక ప్రదర్శనలూ, తెలుగు సదస్సులలో పాల్గొనడం
    • రచయితలు, పాత్రికేయులకి వర్కుషాపులు నిర్వహించడం
    • పాఠశాలలూ, విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శన/వర్కుషాపులు
  • ముద్రణ/ప్రసార మాధ్యమాలు
    • వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించడం
    • రేడియో మరియు టీవీ కార్యక్రమాలు
  • జాలంలో వాడుకరుల సమస్యలకి పరిష్కారాలు సూచించే తోడ్పాటు వేదికని నిర్వహించండి

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer