స్వాగతం!

e-తెలుగు కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇది e-తెలుగు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు.

ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను) మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగాలి. అదే మా స్వప్నం. ఆ దిశగా మేము కృషిచేస్తున్నాం.
మీ కంప్యూటర్లో తెలుగును స్థాపించుకోడానికి సహాయం కావాలా? చూడండి.
Need help for Telugu in your computer? Click here.
తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తొలి రోజు...

ఆనందంగా ఉత్సాహంగా గడిచింది. e-తెలుగు అధ్యక్షుడు వీవెన్, కార్యదర్శి కశ్యప్, కినిగె చావా కిరణ్, అట్లురి అనిల్, రెహ్మానుద్దీన్, ప్రవీణ్, రవితేజ, శ్రీనివాసకుమార్ తదితరుల కలయికతో మన e-తెలుగు స్టాల్ (2వది) కళకళలాడింది. కబుర్లు.. చెప్పుకుంటూ అలమరలు, కుర్చీలు, బల్ల సర్దుకోవడం, అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉన్న తెలుగు వనరుల గురించి తెలిపే కరపత్రాలు సిద్ధం చేయడం, పంపిణీ చేయడం, అధ్యక్ష, కార్యదర్శుల అంకోపరుల (Laptop) ద్వారా సందర్శకులకు కంప్యూటర్లు, అంతర్జాలంలో తెలుగు వాడకం గురించి తెలియజేయడం తదితర కార్యకలాపాలతో తొలిరోజు కార్యక్రమం ఉల్లాసంగా గడిచింది.

తెలుగు బ్లాగుల దినోత్సవం 2011 (డిసెంబర్ రెండవ ఆదివారం)

e-తెలుగు సభ్యులకు ఔత్సాహికులకు, తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ… తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగు బ్లాగుల దినోత్సవం — డిసెంబర్ రెండవ ఆదివారం

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు:

e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, జూన్ 19 2011

e-తెలుగు జూన్ నెల మావేశంఈ నెల 19, ఆదివారం
వేదిక: లమకాన్, హైదరాబాద్
సమయం : సాయంత్రం 3 నుండి 5 గఁ॥ వరకు

కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను గురించి తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ, తెలుగు గురించి చర్చించు కొందాం.

గమనిక: 1. అంకోపరి గల వారు తమ వెంట తెచ్చుకోవాలని మనవి, wifi ఉండొచ్చు కాబట్టి సమాచారాన్ని పంచుకుందాం
2. వేదికలో ఏమైనా మార్పులు ఇక్కడ తెలుపబడతాయి

e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, మే 8 2011

సమయం: ఆదివారం, మే 8, 2011 సాయంత్రం 5 గంటల నుండి 7 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

తెలుగు సంగణనపై సదస్సు — హైదరాబాద్, ఏప్రిల్ 16

సిలికానాంధ్ర మరియు ఆంధ్రప్రదేశం ప్రభుత్వం సంయుక్తంగా "అంతర్జాల తెలుగు సదస్సు" (Telugu Internet Symposium) అని ఒక రోజు చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

సమయం
శనివారం, ఏప్రిల్ 16, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

వేదిక
డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD),
జూబ్లీ హిల్స్, హైదరాబాద్. (గూగుల్ మ్యాప్స్ పటం)

కంప్యూటర్లలో తెలుగు గురించి చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ అనేక విధాలైన కృషి జరుపుతున్నారు. అలాంటి ప్రయత్నాలన్నింటినీ ఒక దగ్గరకు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాచార సాంకేతక రంగంలో తెలుగు గురించి లేదా తెలుగు కోసం కృషి చేస్తున్న వివిధ వ్యక్తుల మధ్య చర్చలకు వీలుకల్పిస్తూ, ఇప్పటివరకూ జరిగిన కృషి ఏమిటి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టిసారించాలన్నది ఈ సదస్సు యొక్క ఉద్దేశం.

e-తెలుగు కూడా ఈ సదస్సులో పాలుపంచుకుంటూంది. ఈ సదస్సుకి మీరు హాజరవాలనుకుంటే, ఈ నమోదు ఫారాన్ని పూరించండి. (ప్రవేశం ఉచితం.)

వెబ్ డెవలపర్లకు e-తెలుగు వర్క్‌షాప్ (జాల నిపుణులకు అవగాహనా సదస్సు)

గత జనవరి e-తెలుగు సమావేశంలో చర్చించుకున్నట్టుగానే ఈ నెల 13 న వెబ్ డెవలపర్స్ కొరకు ఒక సదస్సు మరియు వర్క్‌ షాప్ ను e-తెలుగు నిర్వహించనుంది. ఈ వర్క్ షాపు పూర్తిగా ఉచితం. ఈ వర్క్ షాపులో ఈ అంశాలను చర్చిస్తాము.

  • యూనికోడ్ అంటే ఏమిటి? నేపథ్యం, పరిచయం, ప్రయోజనాలు, టైపింగు పద్ధతులు
  • తెలుగు యూనికోడ్ లో ఒక వెబ్ సైటు నిర్మాణం: PHP, ASP.NET, Python, mySql లలో అమరికలు
  • వర్డ్ ప్రెస్ , డ్రూపల్, మీడియావికీ వంటి CMS లలో తెలుగు సైట్లను రూపొందించడం ఎలా?

హైదరాబాదులో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ఏర్పడి ఈ నెల పదిహేనవ తేదీకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులందరూ వికీపీడియా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. హైదరాబాదులో e-తెలుగు సంస్థ కూడా ఈ వేడుకలను నిర్వహిస్తూంది. ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer